పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం.. ఇమ్రాన్‌ఖాన్‌ను దించేందుకు రంగం సిద్ధం

Pakistan Opposition Submits No Confidence Motion Against Imran Khan
x

పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం.. ఇమ్రాన్‌ఖాన్‌ను దించేందుకు రంగం సిద్ధం

Highlights

Pakistan: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం మొదలైంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దింపేందుకు అక్కడి విపక్షాలన్నీ జట్టుకడుతున్నాయ్.

Pakistan: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం మొదలైంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దింపేందుకు అక్కడి విపక్షాలన్నీ జట్టుకడుతున్నాయ్. ఎట్టి స్థితిలో ప్రజాకంటక ప్రధాని ఉండటానికి వీళ్లేందంటున్నాయ్. ఇమ్రాన్ ఖాన్ సర్కారుపై పార్లమెంట్లో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాయ్ అక్కడి విపక్షాలు. తీర్మానంపై వంద మంది సభ్యులు సంతకాలు చేయడంతో సర్కారు గద్దె దిగడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తీర్మానంపై మరో వారం రోజుల్లోగా పార్లమెంట్ సమవేశపర్చాల్సి ఉంది. 342 మంది సభ్యులున్న సభలో 172 మంది సభ్యులు ఆమోదం తెలిపితే ఇమ్రాన్ ఖాన్ సర్కారు కూలిపోవడం ఖాయం గత ఏడాది విశ్వాస తీర్మానం నెగ్గించుకున్నా ఆరుగురు సభ్యులు మాత్రమే అదనంగా మద్దతివ్వడంతో ఈసారి ఏమైపోతుందన్న బెంగ ఇమ్రాన్ ఖాన్ లో వ్యక్తమవుతోంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం ముందుండి మొత్తం రాజకీయం నడిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories