Coronavirus: కరోనాకు వ్యాక్సిన్ రెడీ.. ప్రయోగాలు ప్రారంభం

Coronavirus: కరోనాకు వ్యాక్సిన్ రెడీ.. ప్రయోగాలు ప్రారంభం
x
Highlights

ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు లక్షా 90 వేల 098 మంది మరణించారు.

ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు లక్షా 90 వేల 098 మంది మరణించారు. 27 లక్షల 5 వేల మందికి పైగా వ్యాధి భారిన పడ్డారు.. ఇక 7 లక్షల 42 వేల 206 మంది కోలుకున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ యొక్క ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఊరట కలిగించే వార్త చెప్పింది. కరోనావైరస్ పై పోరాటానికి వ్యాక్సిన్ తయారు చేసింది.. అంతేకాదు మానవులపై క్లినికల్ ట్రయల్ గురువారం యూకేలో ప్రారంభం అయ్యాయి. ఈ టీకా విజయవంతం కావడానికి 80% అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ నేతృత్వంలోని ఆక్స్ఫర్డ్ బృందం ChAdOx1 nCoV-19 ను పరీక్షిస్తోంది. ఈ ట్రయల్ ప్రోగ్రాం కోసం సుమారు 187 కోట్లు ఖర్చు చేశారు. ఈ టీకా సుమారు 500 మంది వాలంటీర్లపై ప్రయోగం చేసి.. దీనిని బట్టి శాస్త్రవేత్తలు ప్రాథమిక అంచనాకు వస్తారని తెలుస్తోంది.

దీనిపై బ్రిటీష్ ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్ మాట్లాడుతూ, ప్రయోగం విజయవంతం అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొదటి దేశం యూకే నే కానుందని ఆయన అన్నారు. ఈ ఘోరమైన మహామ్మారిని పోగొట్టడానికి చెయ్యవలసిన అన్ని చేస్తామని ఆయన చెప్పారు. మరో 22 మిలియన్ పౌండ్లతో లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో రెండవ టీకా ప్రాజెక్టుకు నిధులు సమకూర్చినట్లు చెప్పారు.

అలాగే వ్యాక్సిన్లు క్లినికల్ టెస్టింగ్‌లో సమర్థవంతంగా నిరూపిస్తే వాటి తయారీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆర్థిక సహాయం అందించడానికి యుకె ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. కాగా కోవిడ్-19 కారణంగా గత 24 గంటల్లో 616 మంది మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 18,738 కు చేరింది, అలాగే కేసులు కూడా 138,078 కు చేరుకున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories