ఆశలు రేకెత్తిస్తోన్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్.. ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు

ఆశలు రేకెత్తిస్తోన్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్.. ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు
x
Highlights

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకా వృద్ధులు, యువతలో ఒకేలాంటి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుందని తేలింది. వృద్ధుల్లో ప్రతికూల స్పందన కూడా చాలా...

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకా వృద్ధులు, యువతలో ఒకేలాంటి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుందని తేలింది. వృద్ధుల్లో ప్రతికూల స్పందన కూడా చాలా తక్కువగా ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వైరస్‌ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే వృద్ధుల్లో టీకా రక్షిత యాంటీబాడీలు, టీ సెల్స్‌ను ప్రేరేపిస్తుందని ఇప్పటికే ఫైనాన్సియల్ టైమ్స్‌ వెల్లడించింది. కరోనా వైరస్‌ విజృంభణతో కలవరపాటు గురైన ప్రపంచానికి ఆక్స్‌ఫర్డ్ టీకా ఆశాజనకంగా కనిపించింది. ఇప్పుడు అన్ని దేశాలు దాని తుది ఆమోదం కోసమే ఎదురుచూస్తున్న తరుణంలో సంస్థ ప్రకటన సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. ఐతే ప్రస్తుతానికి టీకా సిద్ధంగా లేదని, దాని పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం చేస్తున్నట్లు బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories