Omicron: 20 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్

Omicron Expanded in 20 Countries Across the World
x

20 దేశాల్లో వ్యాపించిన ఓమిక్రాన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Omicron: దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో నమోదు

Omicron: ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ పై తాజాగా మరిన్ని విషయాలు వెలుగులొకి వచ్చాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూడటానికి ముందే గత అక్టోబరులోనే ఈ కొత్త వేరియంట్‌ పలు దేశాలకు వ్యాపించినట్టు స్పష్టమవుతోంది. అయితే, దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది..?. వ్యాక్సిన్‌తో కలిగే రోగనిరోధక శక్తిని ఇది తప్పించుకుంటుందా? అన్న విషయాల్లో స్పష్టత రాలేదు. పలు ఐరోపా దేశాల్లో డెల్టా కారణంగా పెద్దసంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే, ఒమిక్రాన్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్‌ కారణంగా యూరోపియన్‌ యూనియన్‌లోని 11 దేశాల్లో ఇప్పటివరకూ 44 కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలామంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారేనని తేలింది. తాజాగా మరిన్ని దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ వేరియంట్‌ వ్యాపించిన దేశాల సంఖ్య 20కు చేరింది.

నైజీరియాలో ఒమిక్రాన్‌ తొలి కేసు నమోదైంది. అక్టోబరులో సేకరించిన నమూనాలను పరీక్షించగా కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయినట్టు ఆ దేశ జాతీయ ప్రజాఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొత్త వేరియంట్‌ పై దక్షిణాఫ్రికా అప్రమత్తం చేయడానికి కొన్నివారాల ముందే అక్కడి నుంచి వచ్చినవారి నుంచి ఈ నమూనాలను సేకరించినట్టు తెలిపింది. ఆఫ్రికా నుంచి ఇటీవల సౌదీ అరేబియా వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది.

డిసెంబరు చివరి వరకూ కొత్త రిజర్వేషన్లను తీసుకోవద్దని అంతర్జాతీయ ఎయిర్స్‌ లైన్స్‌ సంస్థలను జపాన్‌ ఆదేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనందున, అత్యవసర చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నవంబరు 22 నుంచి దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఆస్ట్రియా సర్కారు ఈనెల 11 వరకూ పొడిగించింది. ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రియా, దక్షిణ కొరియాల్లో డెల్టా కారక కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి.

దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి 3వేల 476 మంది ప్రయాణికులు భారత్‌ వచ్చినట్లు సమాచారం. వీరికి పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిమిత్తం ప్రయోగశాలకు పంపారు. వీరిలో నెదర్లాండ్స్‌, బ్రిటన్‌ నుంచి వచ్చినవారు నలుగురు ఉన్నారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాతో పాటు బ్రిటన్‌, బ్రెజిల్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌లను కేంద్రం ఎట్‌-రిస్క్‌ దేశాలుగా పేర్కొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories