California Forest Wildfire: అగ్రరాజ్యం అమెరికాను కుదిపేస్తున్న కార్చిచ్చు

Northern California Forest Wildfire Grows 20,000 Acres and Destroys Few Homes | Current fires in California
x

నార్త్ కాలిఫోర్నియాలో బరి అగ్ని ప్రమాదం (ఫైల్ ఇమేజ్)

Highlights

California Forest Wildfire: నార్త్ కాలిఫోర్నియాలో ఎగసి పడుతున్న మంటలు * 1913 తర్వాత తొలిసారి భారీ స్థాయిలో కార్చిచ్చు

California Forest Wildfire: అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో కార్చిచ్చు కల్లోలం సృష్టిస్తోంది. ఒకటీ రెండూ కాదు ఏకంగా లక్షలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి అహుతవుతోంది. ప్రమాదం అంతకంతకూ ముంచుకొస్తుండడంతో స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. గత 120ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి దావాగ్నిని చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు..భీకర వేడిగాలులకు డెత్‌వాలీ నేషనల్ పార్క్ పరిశరాల్లో ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఏకంగా ఇవాళ ఒక్కరోజే 54 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. 1913 తర్వాత తొలిసారి భారీ స్థాయిలో కార్చిచ్చు చెలరేగడం వల్ల బ్యాక్‌వర్త్‌ కాంప్లెక్స్‌ రిజియన్‌లోని ఫారెస్ట్‌ రేంజ్‌లో దాదాపు 72 కిలోమీటర్ల మేర భారీ వృక్షాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఓరెగాన్‌లో 311 కిలోమీటర్ల అటవీ ప్రాంతం మంటల ధాటికి తగలబడినట్లు అధికారులు చెబుతున్నారు. అటు.. వాషింగ్టన్‌కు సౌత్‌లో 155 కిలోమీటర్ల పరిధిలో అటవీ ప్రాంతం తగలబడిపోగా.. నెవడా అటవీప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇక..కాలిఫోర్నియాలోని నార్త్ హిల్ స్టేషన్లోని నివాస ప్రాంతాలపై కార్చిచ్చు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మంటలు, వేడిగాలుల తాకిడితో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతానికి 518 మైళ్ల పరిధిలోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏ క్షణానైనా నార్త్ కాలిఫోర్నియా ప్రజలు ఇళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈస్ట్ కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అటవీ ప్రాంతం నలుదిక్కులా మంటలు చెలరేగడంతో ఏ ఒక్క వన్య ప్రాణికీ తప్పించుకునే అవకాశం కనిపించడంలేదు. ఇప్పటికే చాలా మూగజీవాలు అగ్నికి అహుతైపోయి ఉంటాయన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. మిగిలిన వన్యప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధి కారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు.. ఈస్ట్ కాలిఫోర్నియాలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకూ మంటలు ఎగసి పడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక.. కార్చిచ్చును కంట్రోల్ చేసేందుకు అమెరికా ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. దాదాపు 12వందల మంది సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. వేడి గాలులకు తట్టుకుంటూనే వేలాది ఫైర్ వెహికల్స్ మంటలతో పోరాడుతున్నాయి. మరికొన్ని చోట్ల హెలికాప్టర్ల సాయంతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories