North Korea: మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా

North Korea Conducts Missile Test Once Again
x

North Korea: మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా

Highlights

North Korea: చైనాకు సమీపంలో ఉన్న ద్వీపంలో క్షిపణి పరీక్షలు

North Korea: వరుస క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోతున్నాడు కిమ్ జోంగ్ ఉన్. దీంతో కొరియన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించిన కిమ్‌ కింగ్డమ్‌.. తాజాగా మరోసారి పలు క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించింది. శనివారం కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు ఉత్తర కొరియా పలు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 4 గంటలకు ఈ ప్రయోగాలు జరిగినట్లు తెలిపింది. దీంతో కొరియా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. అవి జపాన్‌ సముద్రంలో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో ప్యాంగాంగ్‌ వరుసగా క్షిపణులను ప్రయోగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories