Russia - Ukraine War: రష్యాపై స్పీడ్ పెంచిన నాటో దేశాలు.. మారుతున్న పరిణామాలు

North Atlantic Treaty Organization Attack on Russia | Russia Ukraine Latest News
x

Russia - Ukraine War: రష్యాపై స్పీడ్ పెంచిన నాటో దేశాలు.. మారుతున్న పరిణామాలు

Highlights

Russia - Ukraine War: ఉక్రెయిన్‌ను ఆర్థికంగా, సైనికపరంగా ఆదుకుంటాం, ప్రతి ఇంచు భూమిని రక్షిస్తాం - నాటో

Russia - Ukraine War: గురువారం ఉదయం నుంచి మొదలైన ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలు... శుక్రవారం కొనసాగాయి. అయితే మధ్యాహ‌్నం తర్వాతి పరిణామాలతో ఒక్కసారిగా సీన్‌ మారింది.ఉక్రెయిన్‌ ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమని రష్యా.. ఈలోపే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఉక్రెయిన్‌ పరస్పర ప్రకటనలు చేసుకున్నాయి. చర్చల దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయని.. యుద్ధం ముగియొచ్చని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి విజ్ఞప్తిని సైతం లెక్కచేయకుండా.. దాడులు ముమ్మరం చేయాలని పుతిన్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఈయూ ఆంక్షలు, బంధువుల ఆస్తుల్ని సీజ్‌ చేయడం, అమెరికా సైబర్‌ దాడులు, నాటో దళాల కీలక సమావేశం.. ఒకదానివెంట ఒకటి వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో పుతిన్‌ మనసు మార్చుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. శుక్రవారం ఓ టీవీ ఛానెల్‌లో ప్రసంగించిన పుతిన్‌, ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ ఉక్రెయిన్‌ సైన్యాన్ని కోరాడు.

ప్రస్తుతం రాజధాని కీవ్‌ Kyiv పై రష్యా దళాలు విరుచుకుపడుతున్నాయి. యుద్ధ ట్యాంకర్లు నగరాన్ని చుట్టుముట్టగా.. గెరిల్లా దళాలతో రష్యా ఆర్మీ దాడులు నిర్వహిస్తోంది. భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ను రష్యా దళాలు ఆక్రమించుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఉక్రెయిన్‌ బలగాలు సైతం ధీటుగానే పోరాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనం. ఈ తరుణంలో నాటో దళాల ఎమర్జెన్సీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది

ఒక‌వైపు ఉక్రెయిన్‌పై దండ‌యాత్ర‌కు దిగిన ర‌ష్యా.. తాజాగా స్వీడ‌న్‌, ఫిన్‌లాండ్‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గ‌నైజేష‌న్ (నాటో)లో స‌భ్యులుగా చేరితే స్వీడ‌న్‌, ఫిన్‌లాండ్ చేరితే, హానిక‌ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ర‌ష్యా విదేశాంగ‌శాఖ అధికార ప్ర‌తినిధి డిమిట్రీ పెస్కోవ్ హెచ్చ‌రించారు. ఉక్రెయిన్‌లోకి ర‌ష్యా సైన్యాలు ప్ర‌వేశించాల‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసిన త‌ర్వాత పెస్కోవ్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది. నాటోలో స్వీడ‌న్, ఫిన్‌లాండ్ చేరితే వాటిపైనా యుద్ధానికి దిగాల్సి వ‌స్తుంద‌ని ఇంత‌కుముందే ర‌ష్యా హెచ్చ‌రించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories