Niagara Falls: మంచు తుఫాన్‌తో అమెరికా అతలాకుతలం.. గడ్డకట్టిన నయాగరా జలపాతం

Niagara Falls Transforms into Partially Frozen Winter Wonderland
x

Niagara Falls: మంచు తుఫాన్‌తో అమెరికా అతలాకుతలం.. గడ్డకట్టిన నయాగరా జలపాతం

Highlights

America: మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

America: అమెరికాను మంచు తుఫాన్ ఛిన్నాభిన్నం చేస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధులైపోతున్నారు. నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గడ్డకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నయాగరా ఫాల్స్‌లో ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు జాలువారుతుంది. ఈ నీరు ప్రతి సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జ్‌పై నడవటాన్ని నిషేధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories