New Virus Passed In China : చైనాలో కొత్త రకం వైరస్.. ఏడుగురు మృతి!

New Virus Passed In China : చైనాలో కొత్త రకం వైరస్.. ఏడుగురు మృతి!
x
New Virus Passed In China
Highlights

New Virus Passed In China :చైనా దేశంలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధి

New Virus Passed In China :చైనా దేశంలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా చాలా మంది చనిపోగా, మరికొంతమంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇక వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచ శాస్త్రవేత్తలు నిమగ్నం అయి ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే చైనాలో మరో మాయదారి రోగం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే దీనివలన ఏడుగురు చనిపోగా, దాదాపుగా 60 మంది దీని బారినపడ్డారు. ఈ మేరకు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

చైనా దినపత్రిక 'గ్లోబల్ టైమ్స్' ప్రకారం మనుషుల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌ల్లో గత నెలలో 37 మందికి పైగా తీవ్రమైన జర్వంతో కూడిన థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ బున్యావైరస్ (SFTS Virus) బారినపడ్డారు. ఇక తర్వాత అన్హుయి ప్రావిన్స్‌లో 23 మందికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించినట్లు గ్లోబల్ టైమ్స్ తన నివేదికలో వెల్లడించింది.

ఇక జియాంగ్సు రాజధాని నాన్జియాంగ్‌కు చెందిన ఒక మహిళకు ఈ వైరస్ సోకింది. అయితే ఈ వ్యాధి లక్షణాలలో మొదట్లో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. ఇక ఆ తర్వాత ఆమె శరీరంలో ల్యూకోసైట్స్, ప్లేట్‌లెట్స్ తగ్గినట్లుగా అక్కడి వైద్యులు గుర్తించారు. అనంతరం ఆమెకి నెల రోజుల పాటుగా చికిత్స అందించిన తర్వాత ఆమె కోలుకుంది. అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

ఇక, SFTS వైరస్‌ కొత్తదేమీ కాదనీ, తొలిసారి చైనాలో 2011లోనే కనుగొన్నారని నిపుణులు భావిస్తున్నారు.ముందుగా జంతువుల శరీరానికి అంటుకుని, తరువాత మానవులకు వ్యాపించే నల్లి (టిక్) వంటి కీటకాల ద్వారా వైరస్ వ్యాపించి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక దీనిపైన జిన్జియాంగ్ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యుడు షెంగ్ జిఫాంగ్ మాట్లాడుతూ.. మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించే విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని అన్నారు. అంతేకాకుండా ఈ వైరస్ బారినపడిన వ్యక్తుల రక్తం లేదా శ్లేషం ద్వారా సంక్రమిస్తుందని అయన వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories