Human metapneumovirus: చైనాను కలవరపెడుతున్న కొత్త వైరస్..కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి

Human metapneumovirus
x

Human metapneumovirus

Highlights

Human metapneumovirus: కోవిడ్ -19 మహమ్మారి తర్వాత చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. హ్యుమన్ మెటాప్ న్యూమోవైరస్ వ్యాప్తి తీవ్రం అవుతోంది.

Human metapneumovirus: కోవిడ్ -19 మహమ్మారి తర్వాత చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. హ్యుమన్ మెటాప్ న్యూమోవైరస్ వ్యాప్తి తీవ్రం అవుతోంది. రిపోర్టులు, సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా ఈ వ్యాధి చైనాలో వేగంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రుల ముందు రోగులు క్యూ కడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు ఇన్ ఫ్లుయెంజా ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్ 19 మల్టిపుల్ వైరస్ లు వ్యాప్తి చెందుతున్నాయని చెబుతున్నారు. ఇది ధ్రువీకరించనప్పటికీ చైనా అత్యంవసర పరిస్థితి ప్రకటించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హెచ్ఎంపీవీ ఫ్లూ లక్షణాలతోపాటు కోవిడ్ 19 లక్షణాలను కలిగి ఉంటుందని సమాచారం. వైరస్ వ్యాప్తి చెందడంపై అక్కడి అధికారులు పరిస్థితులను గమనిస్తున్నారు.


చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం..హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నాయి. తీవ్రమైన కేసుల్లో బ్రోన్కైటిస్ లేదా న్యూమోనియాకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా శిశువులు, వ్రుద్ధుల్లో, ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ వ్యాధి తీవ్ర్ ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆస్తమా, క్రానిక్ అప్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేదా ఎంపిసెమా వంటి లంగ్స్ జబ్బులు ఉన్నవారు తీవ్రమైన ఫలితాలకు గురయ్యే ఛాన్స్ ఉందని చైనా అధికారులు పేర్కొన్నారు. సిడిసి చైనా ప్రకారం వైరస్ ప్రధానంగా దగ్గు, తుమ్మడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని తెలిపింది. వ్యాధి పొదిగే కాలం 3 నుంచి 5రోజుల ఉంటుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories