యూకేలో కొత్త కరోనా కలకలం.. వ్యాక్సినేషన్ వేళ ఏమిటీ పరిణామం?

యూకేలో కొత్త కరోనా కలకలం.. వ్యాక్సినేషన్ వేళ ఏమిటీ పరిణామం?
x
Highlights

ప్రపంచమంతా వాక్సినేషన్ హడావుడిలో ఉంటే కరోనా కొత్త రూపంలో మరోసారి భయపెట్టబోతోందా? బ్రిటన్ ను వెంటాడుతున్న కరోనా కొత్త రూపం తీవ్రత ఎలా ఉంది? ఈ ప్రశ్నలకు...

ప్రపంచమంతా వాక్సినేషన్ హడావుడిలో ఉంటే కరోనా కొత్త రూపంలో మరోసారి భయపెట్టబోతోందా? బ్రిటన్ ను వెంటాడుతున్న కరోనా కొత్త రూపం తీవ్రత ఎలా ఉంది? ఈ ప్రశ్నలకు ప్రమాదం పొంచే ఉందనే సమాధానాలే వస్తున్నాయి. బ్రిటన్ లో కనిపించిన ఈ కొత్త రకం కరోనాతో ప్రపంచం మొత్తం అప్రమత్తమైంది. చాలా దేశాలు బ్రిటన్ నుంచి తమ దేశాలకు విమాన సర్వీసులను రద్దుచేశాయి. మన దేశం కూడా వైరస్ విస్తరణను అడ్డుకోడానికి ఆ దేశంతో విమాన సర్వీసులను ఈనెలాఖరు వరకూ రద్దు చేసింది. ఈ నిర్ణయం రేపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర విమాన యాన శాఖ తెలిపింది. అంతేకాదు యూకే నుంచి రావాలనుకున్న వాళ్లు రేపటిలోగా భారత్ కు వచ్చేయాలని, విమానాశ్రయాల్లో వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని సూచించింది. బ్రిటన్ లో పరిణామంతో ఐరోపా సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. చాలా దేశాలు ఇప్పటికే బ్రిటన్ తో విమాన సర్వీసులను రద్దుచేసుకున్నాయి.

కొత్త రకం కరోనా రూపాంతరంతో బ్రిటన్ వణికిపోతోంది. యూకే నుంచి ఇటలీ వచ్చిన ఒక వ్యక్తిలో కరోనా వేరియంట్ ను గుర్తించారు. దాంతో చాలా దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ తో విమాన సర్వీసులు, రైలు సర్వీసులను బెల్జియం రద్దు చేసింది. సౌదీ కూడా యూకేనుంచి విమానసర్వీసులు రద్దు చేసింది. మరో వైపు యూకే, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ దేశాలతో ఇజ్రాయెల్ విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఫ్రాన్స్, ఈక్వెడార్ దేశాలు యూకేకు విమానాలను నిలిపి వేశాయి. మరికొన్ని దేశాలు కోవిడ్ నెగటివ్ రిపోర్టు ఉన్నవారినే పరిమిత సంఖ్యలో తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి.

అటు స్టాక్ మార్కెట్ పైనా కరోనా వేరియంట్ ప్రభావం కనిపించింది. స్టాక్ మార్కెట్లన్నీ ఒక్కసారిగా కుప్ప కూలాయి అయితే కొత్త రకం వైరస్ తో ప్రమాద మేమీ పొంచి లేకపోయినా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్ష వర్ధన్ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిణామాలను గమనిస్తున్న భారత్ పరిస్థితిని ఎదుర్కొనడానికి సర్వ సిద్ధంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories