Nepal PM KP Sharma Oli Comments on Lord Sri Rama: శ్రీరాముడు నేపాలీయే.. నేపాల్ ప్రధాని కీలక వాఖ్యలు

Nepal PM KP Sharma Oli Comments on Lord Sri Rama: శ్రీరాముడు నేపాలీయే.. నేపాల్ ప్రధాని కీలక వాఖ్యలు
x
KP Sharma Oli (File Photo)
Highlights

Nepal PM KP Sharma Oli Comments on Lord Sri Rama: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మస్థలం పైన నేపాల్ ప్రధాని కీలక వాఖ్యలు చేశారు..

Nepal PM KP Sharma Oli Comments on Lord Sri Rama: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మస్థలం పైన నేపాల్ ప్రధాని కీలక వాఖ్యలు చేశారు.. శ్రీరాముడు, సీత ఇద్దరు నేపాలీ వారేనని అంటూ కామెంట్స్ చేశారు ప్రధాని కేపీ శర్మ ఓలీ .. శ్రీరాముడి జన్మస్థలం ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య కాదని, నేపాల్ లో ఉన్న అయోధ్య అంటూ కొత్త చర్చకు దారీ తీశారు ఆయన.. నేపాల్‌లోని బీర్‌గంజ్‌ పశ్చిమాన ఉన్న చిన్నగ్రామమే అయోధ్య అని ప్రధాని నివాసంలో జరిగిన భానుభక్త ఆచార్య జయంతి కార్యక్రమంలో ఓలీ తెలిపారు...

ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా సాంస్కృతిక నిజాలను కప్పిపెట్టారు. భారతీయ రాజు రాముడికి సీతను ఇచ్చి పెళ్లి చేశామని మనం భావిస్తున్నాం. కానీ, అయోధ్యకు చెందిన శ్రీరాముడికి మనం సీతను ఇచ్చాం. నిజమైన అయోధ్య నేపాల్‌లో ఉంది. శ్రీరాముడు నేపాలీ" అంటూ కామెంట్స్ చేశారు.. గత కొద్దిరోజుల క్రితం ఆయన భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..

ఆ వాఖ్యలు మరిచిపోకముందే ఆయన ఏకంగా శ్రీరాముడి జన్మస్థలం పైన హాట్ కామెంట్స్ చేయడం పెద్డ దుమారానికి దారీ తీసింది. దీనిపైనే బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. హిందువుల మనో భావాలు దెబ్బతీసేలా ఆయన వాఖ్యలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.. చైనాకి పూర్తిగా లొంగిపోయిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వారు చెప్పినట్టుగా డ్రామాలు ఆడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఓలీ వ్యాఖ్యలను స్వయంగా ఆ పార్టీ నేత ప్రచండ ఖండించండం గమనార్హం.




Show Full Article
Print Article
Next Story
More Stories