అంత ప్రేమ ఉంటే ఇండియాకే వెళ్లండి.. పాకిస్తాన్‌లో ఉండి దేశాన్ని అవమానిస్తారా?

Nawaz Sharifs Daughter Criticizes Imran Khan | Telugu News
x

ఇమ్రాన్ ఖాన్‌పై నవాజ్ షరీఫ్ కుమార్తె తీవ్ర విమర్శలు

Highlights

Pakistan: ప్రతిపక్షనేతగా మాజీ ప్రధాని తనయ మరియం నవాజ్ షరీఫ్

Pakistan: ఇండియాపై అంత ప్రేమే ఉంటే ఇక్కడ ఎందుకు అక్కడికే వెళ్లపోండంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ప్రతిపక్ష నేత మరియం నవాజ్ షరీఫ్ పాకిస్తాన్‌లో ఉండి దేశాన్ని అవమానిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. సూపర్ పవర్లకు ఇండియా తలవంచట్లేదని ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలు విధించినా రష్యా ఇండియా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ ఆకాశానికెత్తారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ప్రపంచంలో ఏ దేశం కూడా డిక్టేట్ చేయాలేరంటూ జాతిని ఉద్దేశించి మాట్లాడారు ఇమ్రాన్. ఐతే ఇలాంటి వ్యాఖ్యలు దేశంపై గౌరవం లేనట్టుగా ఉన్నాయంటూ ఇప్పుడు అక్కడి విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయ్. ఐతే ప్రభుత్వాన్ని రక్షించుకోవడం అసాధ్యమన్న భావనతోనే ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న వర్షన్ పాకిస్తాన్ లో విన్పిస్తోంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయ్. అవిశ్వాస తీర్మానం వాయిదాకు కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

342 సీట్ల అసెంబ్లీలో 172 కంటే ఎక్కువ ఉన్నాయంటున్న విపక్షం చెబుతోంది. ఇవాళ ఓటింగ్ జరిగితే ఇమ్రాన్ ఓడిపోవడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఇమ్రాన్ బయటపడలేరంటున్నారు ఎక్స్‌పర్ట్స్. రాజకీయ జీవితంలోనే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పదవీ విచ్యుతడైతే అది అవిశ్వాసం ద్వారా తొలగించిన మొదటి ప్రధానిగా అపకీర్తిని మూటగట్టుకుంటారు. ఇవాళ ఉదయం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు సభ హాజరై వాయిదా పడింది. సభకు ఇమ్రాన్ హాజరుకాకపోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.ప్రస్తుతం పాకిస్తాన్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మెజార్టీ కోల్పోయింది. డజనుకు పైగా సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధంగా ఖావడంతో విదేశీ శక్తులు తమ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు యత్నిస్తున్నాయని ఇమ్రాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చట్టసభ సభ్యులను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories