Syria: సిరియా నుంచి భారత్‎కు చేరుకున్న 75 మంది పౌరులు.. మిగిలినవారు భారత రాయబార కార్యాలయంతో టచ్‎లో ఉండాలని సూచన

Syria: సిరియా నుంచి భారత్‎కు చేరుకున్న 75 మంది పౌరులు.. మిగిలినవారు భారత రాయబార కార్యాలయంతో టచ్‎లో ఉండాలని సూచన
x
Highlights

Syria: కల్లోలంగా ఉన్న సిరియా నుంచి 75 మంది భారతీయ పౌరులను భారత్ మంగళవారం తరలించింది. సిరియాలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం మంగళవారం 75...

Syria: కల్లోలంగా ఉన్న సిరియా నుంచి 75 మంది భారతీయ పౌరులను భారత్ మంగళవారం తరలించింది. సిరియాలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం మంగళవారం 75 మంది భారతీయ పౌరులను సిరియా నుండి తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అర్థరాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ పౌరులందరూ సురక్షితంగా లెబనాన్ చేరుకున్నారని.. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియాలో ఉన్న భారతీయ పౌరులు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించినట్లు పేర్కొంది. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూనే ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

తిరుగుబాటుదారులు ఆదివారం డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోవడంతో ..53 ఏళ్లుగా సిరియాపై అసద్ కుటుంబ పాలన ముగిసింది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని బఫర్ జోన్‌కు పంపింది. అక్కడ రెండు దేశాల మధ్య ఎటువంటి సైనిక కార్యకలాపాలు చేయకూడదని ఒప్పందం ఉంది. అసద్ మాస్కోలో ఉన్నారని, ఇక్కడ ఆశ్రయం పొందారని రష్యా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

అతని దాదాపు 14 సంవత్సరాల పదవీకాలం అంతర్యుద్ధం, రక్తపాతం, అతని రాజకీయ ప్రత్యర్థులపై క్రూరమైన అణిచివేతకు ప్రసిద్ధి చెందింది. సిరియాలో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని, ఆ దేశంలో శాంతియుతమైన, సమగ్రమైన సిరియా నేతృత్వంలోని రాజకీయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories