అంతరిక్షంలో అద్భుతం క్రియేట్ చేసిన నాసా

అంతరిక్షంలో అద్భుతం క్రియేట్ చేసిన నాసా
x
Highlights

నాసాకు చెందిన ఒసైరిస్ రెక్స్‌ వ్యోమనౌక బెన్ను అనే గ్రహశకలంపై విజయవంతంగా దిగింది. అన్ని అనుకున్నట్లుగానే జరిగినట్లు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన...

నాసాకు చెందిన ఒసైరిస్ రెక్స్‌ వ్యోమనౌక బెన్ను అనే గ్రహశకలంపై విజయవంతంగా దిగింది. అన్ని అనుకున్నట్లుగానే జరిగినట్లు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన సైంటిస్టులు తెలిపారు. గ్రహశకలంపై దిగగానే ఒసైరిస్‌ నాసా కేంద్రానికి సంకేతాలు పంపినట్లు వివరించారు. ఐతే ఆ ఆస్టరాయిడ్‌కు సంబంధించి నమూనాలను సేకరించే అసలు లక్ష్యాన్ని అది ఎంతవరకు పూర్తి చేసిందన్న దానిపై క్లారిటీ లేదు. ఇది తెలుసుకోవడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుందని సైంటిస్టులు తెలిపారు.

ఒసైరిస్ ల్యాండింగ్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ కనిపించింది. ఏవైనా అనూహ్య పరిణామాలు ఎదురైతే తిరిగి గాల్లోకి దూసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఐతే ఒసైరిస్‌కు ఆ అవసరం రాలేదు. అన్ని అడ్డంకుల్ని దాటుకొని‌ బెన్నుని తాకింది. ఆ గ్రహశకలంపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడంతో ల్యాండింగ్ ప్రక్రియ కష్టంగా సాగింది. బెన్నును చేరడానికి నాసా దాదాపు దశాబ్దకాలంగా కృషి చేస్తోంది. ఆ గ్రహశకలం నుంచి దాదాపు 60 గ్రాముల నమూనాలను ఒసైరిస్ సేకరిస్తుంది. ఇందుకోసం బెన్నుపై టెన్నిస్‌ కోర్టు పరిమాణంలో ఉన్న ఒక ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories