అంగారకుడిపై రోవర్లను పంపిన నాసా... ఆర్టెమిస్ 1లో మనుషులని ఎందుకు పంపట్లేదు

NASA Re-Schedules Artemis 1 Launch After Several Failed Attempts
x

అంగారకుడిపై రోవర్లను పంపిన నాసా... ఆర్టెమిస్ 1లో మనుషులని ఎందుకు పంపట్లేదు

Highlights

*1969 లోనే చంద్రుడిపై అడుగుపెట్టిన చరిత్ర

ARTIMIS-1: నాసా.. ఈ పేరు వింటే.. అంతరిక్ష ప్రయోగాలే గుర్తొస్తాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. 1960 నుంచి 1972 మధ్య అంతరిక్షంపై అధ్బుతమైన ప్రయోగాలను నిర్వహించింది. మనిషిని చంద్రుడిపైకి పంపింది.. అంగారకుడిపై రోవర్లను పంపి.. అక్కడి వాతావరణం తెలుసుకుంటోంది. కానీ.. భూమికి ఉపగ్రహంగా ఉన్న చంద్రుడిపై వెళ్లడానికి మాత్రం చతికిల పడుతోంది. ఆర్టిమిస్‌-1 ప్రయోగం రెండుసార్లు వాయిదా పడింది. సెప్టెంబరు 23న మూడోసారి ప్రయోగానికి షెడ్యూల్‌ చేసినా.. శాస్త్రవేత్తలు మరింత సమయం కావాలని కోరారు. దీంతో జాబిలిపై అమెరికా ప్రయాణం వాయిదా పడింది.. అసలు ప్రయోగమే చేయకుండా ఈ మిషన్‌ ఆగిపోవడంతో అమెరికా అంతరిక్ష ప్రయోగాలపైనే అనుమానాలు కమ్ముకుంటున్నాయి.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా ప్రతిష్టాత్మకంగా జాబిలిపై యాత్ర మళ్లీ వాయిదా పడింది.. ఆర్టిమిస్‌-1 పేరుతో చేపట్టిన మిషన్‌ ఇప్పటికే సాంకేతిక కారణాలతో రెండు సార్లు వాయిదా పడింది. ఆ తరువాత సెప్టెంబరు 23న ప్రయోగించాలని నిర్ణయించారు. అయితే ఇది మరికొద్ది రోజులకు వాయిదా పడింది. ప్రయోగానికి ముందు రాకెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించేందుకు మరింత సమయం కావాలని ఇంజనీర్లు కోరారు. దీంతో ఈ ప్రయోగం వాయిదా పడింది.. మళ్లీ ఎప్పుడు ప్రయోగిస్తారన్నది ఖచ్చితంగా నాసా చెప్పలేకపోయింది. నిజానికి ఆగస్టు 29న ప్రయోగం చేపట్టినా.. ఇంజిన్‌లో లోపాలతో ప్రయోగానికి ముందే ఆగిపోయింది. అంతరిక్షంలో అంత పెద్ద అనుభవం లేని భారత్‌ జాబిలిపై అడుగుపెట్టాలని ప్రయత్నించింది. చంద్రయాన్‌-2 పేరుతో భారత్‌ చేపట్టిన మిషన్‌ చివరి క్షణంలో ఫెయిల్‌ అయింది. చంద్రుడి కక్షలో నుంచి ఉపరితంపై విక్రమ్‌ ఫైడర్‌ ల్యాండింగ్‌ అవుతున్న సమయలో సాంకేతిక సమస్య తలెత్తింది. విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. అంటే.. దాదాపు చంద్రుడిపై వెళ్లినంత పని చేసింది భారత్‌.. కానీ.. అంతరిక్షంపై, చంద్రుడిపై పరిశోధనల్లో అపార అనుభవం సాధించిన అమెరికా మాత్రం కేవలం జాబిలి కక్షలోకి వెళ్లేందుకే అపసోపలు పడుతోంది. దీంతో అసలు నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ బృందం జాబిలిపై అడుగు పెట్టిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో అదంతా సెట్టింగ్‌ అని సోవియట్‌ రష్యా విమర్శలు గుప్పించింది. ఇప్పుడు నాసా అవస్థ చూస్తుంటే అది నిజమేనా? అన్న డౌట్స్‌ అందరినీ తొలిచేస్తున్నాయి.

నాసా అంటే.. ప్రపంచంలోనే టాప్‌ బ్రాండ్.. నాసాకు చెందిన టీషర్ట్స్‌, నాసా మగ్స్‌, బంపర్ స్టిక్కర్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. నాసాను మార్కెట్‌ చేసినంతగా అమెరికా మరే ఏజెన్సీని చేయలేదు. 20వ శతాబ్దంలో అంతరిక్ష పరిశోధనల్లో నాసా కింగ్‌గా నిలిచింది. చంద్రుడిపైకి మనుషులను పంపడమే కాదు.. ఏకంగా అంగారక గ్రహంపై రోవర్లను కూడా దింపింది. అంతేకాదు.. నాసా కారణంగా.. హాలీవుడ్‌లో ఏలియన్ల సినిమాలు రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు అదే నాసా.. జాబిలిపై పరిశోధనలకు చేపట్టిన ఆర్టిమిస్‌-1 మిషన్‌లో భాగంగా.. చంద్రుడి కక్షలోకి ఒక రాకెట్‌ను పంపలేక చతికిల పడుతోంది. కనీసం రాకెట్‌ను నింగిలోకి కూడా పంపలేకపోతోంది. నిజానికి చంద్రుడిపై మనిషిని పంపేందుకు తాజాగా ఆర్టిమిస్‌ను మూడు భాగాలుగా విభజించింది. ఆర్టిమిస్‌-1లో భాగంగా చంద్రుడి కక్షలో మానవరహితంగా పంపాలని నిర్ణయించింది. అది కాస్తా ఢమాల్‌ అన్నది. 2024లో మనిషిని పంపాలని, 2025లో చంద్రుడిపై అడుగు పెట్టాలని ప్రణాళికలను నాసా రచించింది. తొలిసారి మహిళలను చంద్రుడిపైకి పంపాలని భావించింది. ఇదంతా వినడానికి ఎంతో బాగున్నా.. 1960ల్లోనే చంద్రుడిపై నాసా వ్యోమగాములు చంద్రుడిపై అడుగు పెట్టారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా మళ్లీ అక్కడ మనిషిని పంపడానికి ఇన్ని ప్రయత్నాలు ఏమిటన్నది సామాన్యులను వేధిస్తున్న ప్రశ్న.. దీనికి నాసా నుంచి ఎలాంటి సమాధానం లేదు.

నాసా తొలిసారి 1969లో అమెరికా వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపారు. 1972లో ఏకంగా 12 మంది చంద్రుడిపై నడిచారు. అప్పటి నుంచి నాసా చంద్రుడిపైకి మళ్లీ మనుషులను పంపలేదు. దీనికి అమెరికా చెబుతున్న కారణం.. అత్యంత ఖర్చుతో కూడున్న వ్యవహారమని.. అందుకే మళ్లీ చంద్రుడిపైకి వెళ్లలేదని వివరిస్తోంది. అయితే ఈ వాదన అంత సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. పోనీ అమెరికా చెప్పిందే నిజమనుకున్నా.. ఇప్పుడు గతం కంటే భారీగా వెచ్చించి.. చంద్రుడిపైకి మళ్లీ వెళ్లాలని అమెరికా ఎందుకు నిర్ణయం తీసుకున్నది. అన్న చర్చ తెరపైకి వస్తోంది. తాము శాస్త్రీయ ఆవిష్కరణల కోసం చంద్రుడిపైకి తిరిగి వెళ్తున్నట్టు నాసా ప్రకటించింది. కొత్త తరం అన్వేషకులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ప్రేరణ కల్పిస్తామని చెబుతోంది. అయితే ఇది అత్యంత భారీగా ఖర్చుతో కూడుకున్న ప్రేరణ. అందుకు 10 వేల కోట్ల డాలర్లను నాసా వెచ్చిస్తోంది. గత 50 ఏళ్లలో ఏలాంటి చంద్రుడిపై ఎలాంటి పరిశోధనలు చేయకుండా.. అంత భారీగా ఖర్చు చేసి.. ఈ మిషన్‌ చేపట్టడం ఏమిటో? అంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా నాసా ఈ మిషన్‌ను ఎందుకు చేపడుతోంది?

నాసా ఆర్టిమిస్‌ మిషన్‌ను చేపట్టడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి నాసాలో ఉద్యోగాన్ని కాపాడుకోవడం.. నాసాలో నేరుగా 17వేల మంది పని చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలుపుకుంటే.. పరోక్షంగా లక్ష మంది పని చేస్తున్నారు. కొన్ని వందల కంపెనీలు ఇందులో పని చేస్తున్నాయి. రెండో కారణం ఏమిటంటే.. గొప్పల కోసం ఈ ప్రాజెక్టును నాసా చేపట్టింది. సూపర్‌ పవర్‌గా ఎదిగిన అమెరికా.. ఇప్పుడు టెక్నాలజీలో చైనాతో పోటీ పడలేకపోతోంది. చైనాతో పోలిస్తే.. ఈ ప్రాజెక్టుకు కచ్చితమైన లక్ష్యమంటూ ఏదీ లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆర్టిమిస్‌ ద్వారా తమ శక్తిని నిరూపించుకోవడానికి అమెరికా తహతహలాడుతోంది. కానీ.. ఆర్టిమిస్‌ అందుకు విరుద్ధమైన ఫలితాన్నిస్తోంది. అమెరికా బలహీనతలతను ఈ మిషన్ బయటపెడుతోంది. అందుకు నిదర్శనమే రాకెట్‌ ఇంజిన్‌.. 350 కోట్ల డాలర్లను వెచ్చించి.. నాసా సింగిల్‌ యూజ్‌ ఇంజిన్లను రూపొందించింది. అంటే ఒకో ఇంజిన్‌కు 145 కోట్ల డాలర్లను వెచ్చిస్తోంది. మళ్లీ మళ్లీ వాడుకునేందుకు అవసరమైన ఇంజన్లను స్పేస్‌ ఎక్స్‌ వంటి కంపెనీలు తయారు చేస్తుంటే.. నాసా మాత్రం సింగిల్‌ యూజ్‌ ఇంజిన్లకే ఇంత ఎందుకు ఖర్చు పెడుతున్నదన్నది కూడా నిపుణులను తొలిచేస్తోంది. నాసా అవుట్‌ డేటెడ్‌ టెక్నాలజీతో భారీగా ఖర్చు పెడుతోందని విమర్శిస్తున్నారు.

ఏదేమైనా.. నాసా ఆర్టిమిస్‌ మిషన్‌ ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ప్రయోగించముందే.. ఆగిపోవడమే అందుకు కారణం.. భారత్‌, చైనా చంద్రుడిపై అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంటే.. అగ్రదేశం మాత్రం ప్రయోగస్థాయిలోనే నిలిచిపోయింది. అమెరికా పరిస్థితిని చూస్తే.. అయ్యో పాపం అనుకునేలా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories