చైనాలో వెలుగులోకి వచ్చిన మరో ప్రాణాంతక బ్యాక్టీరియా

చైనాలో వెలుగులోకి వచ్చిన మరో ప్రాణాంతక బ్యాక్టీరియా
x
Highlights

ప్రపంచానికి కరోనాను పరిచయం చేసిన చైనాలో మరో ప్రాణాంతక బ్యాక్టీరియా వెలుగులోకి వచ్చింది. దీనిని వైద్యులు బ్రూసెల్లోసిస్ అని తేల్చేశారు. గన్సు...

ప్రపంచానికి కరోనాను పరిచయం చేసిన చైనాలో మరో ప్రాణాంతక బ్యాక్టీరియా వెలుగులోకి వచ్చింది. దీనిని వైద్యులు బ్రూసెల్లోసిస్ అని తేల్చేశారు. గన్సు ప్రావిన్స్ రాజధాని లాస్‌ఝౌలో 6వేల మంది ఈ బ్యాక్టీరియా బారినపడినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది క్రితం చైనా పశుసంవర్థకశాఖకు చెందిన బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి లీకేజీ కారణంగా ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చినట్టు పేర్కొంది.

చైనాలో 55వేల 7వందల 25 మందిని పరీక్షించారు. వారిలో 6వేలల 6వందల 20 మందికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బ్యాక్టీరియా సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధాల వల్ల, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, తాగడం వల్ల ఈ బ్యాక్టీరియా సోకుతుందని లాన్‌ఝౌ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories