ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మంకీ పాక్స్ కేసులు.. డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్...

Monkeypox Cases Increasing Worldwide WHO Alert to all Countries | Live News
x

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మంకీ పాక్స్ కేసులు.. డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్...

Highlights

Monkeypox: జ్వరం, చలి, తలనొప్పి, శరీరంపై పొక్కులు వంటి లక్షణాలు...

Monkeypox: మంకీపాక్స్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో మొదలైన కేసులు నెమ్మదిగా అన్ని దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటివరకు 12 దేశాలకు పాకగా.. మొత్తంగా 180 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా యూరప్‌లోని 9 దేశాల్లో 100కుపైగా కేసులు నమోదయ్యాయి.

జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్, యూకే దేశాల్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగుచూసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories