పారిస్‌లో కుక్కకు మంకీపాక్స్‌

Monkeypox Affected to Dog
x

పారిస్‌లో కుక్కకు మంకీపాక్స్‌

Highlights

Paris: మనిషి ద్వారా కుక్కకు సోకినట్టు వైద్యులు వెల్లడి

Paris: మంకీపాక్స్‌ వైరస్‌ మనుషుల నుంచి జంతువులకు సోకుతున్నట్టు ఫ్రెంచ్‌ పరిశోధకులు గుర్తించారు. ఇద్దరు స్వలింగ సంపర్కుల నుంచి కుక్కకు సోకినట్టు మెడికల్ జర్నల్ ద లాన్సెట్ తెలిపింది. ఇద్దరు స్వలింగ సంపర్కులకు మంకీపాక్స్ లక్షణాలు కనిపించిన 12 రోజుల తరువాత.. వారి ఇంట్లో ఉన్న నాలుగేళ్ల ఇటాలియన్‌ గ్రేహోండ్‌ కుక్కలోనూ కనిపించాయి. ఆ కుక్కకు గతంలో ఎలాంటి అనారోగ్యం లేదు. వైరస్‌ పరీక్షల్లో దానికి పాజిటివ్‌ తేలింది. స్వలింగ సంపర్కుల్లో లాటినోకి చెందిన వ్యక్తికి స్కిన్‌ అల్సర్ ఉంది. అయితే అతడి వద్ద ఆ కుక్క పడుకోవడంతోనే వైరస్‌ సోకినట్టు గుర్తించారు. లాటినో వ్యక్తి, కుక్క నుంచి మంకీపాక్స్ డీఎన్‌ఏను సేకరించి.. పరీక్షించగా.. ఇద్దరికీ సోకింది ఒక్కటే వైరస్సేనని తేల్చారు. దీంతో వైరస్‌ మనిషి నుంచి కుక్క వ్యాపించినట్టు నిర్ధారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories