ఆపదలో వచ్చిన ఆలోచన ఆమెను రక్షించింది!

ఆపదలో వచ్చిన ఆలోచన ఆమెను రక్షించింది!
x
Photo Cutesy: abc.net.au
Highlights

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు.. అది నిజమే.. కానీ ఆపదలో ఒక మహిళకు వచ్చిన ఒక ఐడియా ఆమె ప్రాణాలను కాపాడింది. తన ఆస్తిని రక్షించుకోవాలని ఒక...

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు.. అది నిజమే.. కానీ ఆపదలో ఒక మహిళకు వచ్చిన ఒక ఐడియా ఆమె ప్రాణాలను కాపాడింది. తన ఆస్తిని రక్షించుకోవాలని ఒక యజమాని వేసిన ఐడియా ఒక మహిళప్రాణాలను కాపాడటానికి కారణమైంది. ఈ రెండు ఐడియాలలోనూ రక్షణ పొందినది ఒకే మహిళ. ఆపదలో ఆందోళన చెందకుండా ఆలోచిస్తే జరిగే మంచికి ఈ సంఘటన ఉదాహరణ గా నిలుస్తుంది. అదేవిధంగా తమ ఆస్తులను రక్షించుకోవడానికి టెక్నాలజీని ఉపయోగిస్తే తమ ఆస్తుల్నికాపాడుకోవడమే కాకుండా కష్టాల్లో ఉన్నవారినీ కాపాడవచ్చనే రెండో ఉపయోగాన్నీ తెలియచెప్పిన ఘటన ఇది.

ఆస్ట్రేలియా లోని ఆడిలైడ్ కు చెందిన 55 ఏళ్ల డెబొరా పిలిగ్రిమ్ తన స్నేహితులతో కలసి దక్షిణ ఆస్ట్రేలియా విహార యాత్రకు వెళ్ళింది. అక్కడి ఈస్ట్రన్ మౌంట్ లాఫ్టీ ప్రాంతంలో ఆమె స్నేహితులతో కలసి పార్టీ చేసుకున్నారు. అటు తరువాత అక్కడి దగ్గరలోని చిన్న అడవి ప్రాంతంలో తిరగడానికి వెళ్ళింది. అయితే అక్కడ ఆమె దారి తప్పింది. ఆమెకు ఎటు వెళ్ళాలో తెలీలేదు. ఎటు చూసినా ఒకేలా కనిపిస్తోంది. ఇక తనవాళ్ళ వద్దకు వేల్లలేనేమో అనుకుంది.మూడు రోజులు గడిచిపోయాయి. దాంతో ఆమె అక్కడ నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించింది. దగ్గరలోని విశాలంగా ఉన్న ప్రాంతం వద్దకు చేరుకుంది. అక్కడ sos అనే ఇంగ్లీషు అక్షరాల్ని పెద్దగా మట్టిలో రాసింది. ప్రమాదంలో ఉన్న వ్యక్తులు ఆ అక్షరాల్ని రాస్తారు.

ఈమె ఐడియా వర్కౌట్ అయింది. నిజానికి ఆమె ఉన్నప్రాంతం నీల్ మ్యార్రియట్ అనే వ్యక్తి ప్రయివేట్ స్థలం. అతను అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అందుకే అతను తన స్థలంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. దానిని తన మొబైల్ తొ అనుసంధానించుకున్నాడు. అతను యధాలాపంగా తన మొబైల్ యాప్ లో కెమెరాల దృశ్యాలను చూస్తుంటే.. ఈ sos అక్షరాలు కనిపించాయి. అనుమానం వచ్చింది. ముందు రోజు కెమెరాలో ఆ అక్షరాలు కనిపించలేదని గుర్తువచ్చింది. ఎవరో అక్కడ ప్రమాదంలో ఉన్నారనిపించింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇక అక్కడ తమతో వచ్చిన పిలిగ్రిమ్ కనిపించకుండా పోయింది అంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు ఆమె స్నేహితులు. వారు రెండురోజులుగా ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మ్యార్రియట్ నుంచి ఫోన్ అందింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లారు అక్కడ పిలిగ్రిమ్ వారికి కనిపించింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తను దారి తప్పిన విషయం తెలియగానే ముందుగా కంగారు పడ్డాననీ, అయితే, ఆ ప్రాంతంలో ముందు ధైర్యంగా ఉంది ప్రాణాలను కాపాడుకోవడం ముఖ్యమని భావించాననీ పిలిగ్రిమ్ చెప్పారు. ఇదే క్రమంలో తనకు అక్కడి ఖాళీ ప్రదేశం చూసాకా sos ఆలోచన స్ఫురించిందనీ ఆమె చెప్పుకొచ్చారు. అయితే, ఆ ఆలోచన ఎంతవరకూ ఫలిస్తుందనే ఆందోళన ఉన్నప్పటికీ, ప్రయత్నం చేయాలి కదా అనే ప్రయత్నించినట్టు తెలిపారు.

ఈ ఘటనలో ఆమె కోసం వెతికిన పోలీసులు మాట్లాడుతూ సుమారు నాలుగు రోజులు ఆమె అక్కడ ధైర్యంగా జీవించి ఉండడం గొప్ప విషయం అన్నారు. అంతేకాకుండా స్థానికులు కూడా ఆమె కనిపించడం లేదని చెప్పిన తరువాత స్పందించిన విధానం చాలా గొప్పగా ఉందనీ, ఆమె రాసిన మెసేజ్ ని టెక్నాలజీ తొ గుర్తించి వెంటనే తమకు సమాచారం ఇచ్చిన మ్యర్రియాట్ సహకారం చాల గొప్పదనీ వారు చెప్పారు.

మొత్తమ్మీద టెక్నాలజీ ఒకరి ప్రాణాలను రక్షించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories