Russia: మాస్కోలో ఐసిస్‌ భారీ ఉగ్రదాడి.. 60 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు

Massive Terrorist Attack in Russia
x

Russia: మాస్కోలో ఐసిస్‌ భారీ ఉగ్రదాడి.. 60 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు

Highlights

Russia: ఓ థియేటర్ ప్రాంగణంలోకి చొరబడి కాల్పులు

Russia: రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి దిగారు. క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన పలువురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 60 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ధ్రువీకరించింది. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ‘ఫిక్‌నిక్‌’ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది.

స్థానిక అతి పెద్ద సంగీత కచేరీ హాలులోకి ప్రవేశించిన దుండగులు పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొత్తం 6, వేల మందికిపైగా సామర్థ్యమున్న క్రాకస్‌ సిటీ హాలులో భారీ ఎత్తున సంగీత కార్యక్రమం జరుగుతోంది. సంగీత అభిమానులు కార్యక్రమానికి పెద్దఎత్తున పోటెత్తారు. ఇదే అదనుగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తొలుత పేలుళ్లకు, ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన సంగీత అభిమానులు ఒక్కసారిగా పరుగులు తీశారు. అదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపారు..

ఇది ఉగ్రవాద చర్యేనని రష్యా దర్యాప్తు సంస్థ ప్రకటించింది. దాడిలో అనేక మంది ముష్కరులు పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. బాంబుల దాడిలో మంటల తీవ్రతకు క్రాకస్‌ సిటీ హాలు పైకప్పు కుప్పకూలినట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories