Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం

Massive earthquake in Russia
x

Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం

Highlights

Russia Earthquake: రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0 గా నమోదు

Russia Earthquake: రష్యాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు అందలేదని అధికారులు తెలిపారు. పెట్రోపావ్‌లోవ్స్క్, కమ్‌చట్‌స్కీ భూకంప కేంద్రాలుగా ప్రకంపనలు వచ్చాయని US జియోలాజికల్ సర్వే తెలిపింది.

రష్కాలోని తీరప్రాంతాలకు సునామీ వచ్చే అవకాశం ఉందని US నేషనల్ వెదర్ సర్వీస్ యొక్క పసిఫిక్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తర్వాత ప్రమాదం తగ్గిందని తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోని తీర ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు సముద్ర మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు.

తూర్పు తీర ప్రాంత నగరమైన లావ్‌స్కీ 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం ధాటికి ఇండ్లలో వస్తువులు కిందపడిపోయాయి. అయితే పెద్దగా ఆస్తి నష్టం ఏమీ జరుగలేదని అధికారులు వెల్లడించారు. భారీ భూకంపం నేపథ్యంలో హొనులులు లోని యూఎస్ నేషనల్ సర్వీస్‌కు చెందిన పసిఫిక్ సునామా హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

రష్యా నౌకాదళానికి కీలక ప్రాంతమైన లావ్‌స్కీ నగరంలో లక్షా80వేల మంది నివాసం ఉంటున్నారు. చుట్టూ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యధిక భాగం నావల్ బేస్ అధీనంలో ఉంది. భూకంప తీవ్రతకు లావ్‌స్కీ 280 మైళ్ల దూరంలో ఉన్న షివేలుచ్ అగ్నిపర్వతం బద్దలయ్యింది. సుమారు 8 కిలోమీటర్ల ఎత్తువరకు లావాను వెదజళ్లుతోంది. దీంతో సమీపంలో ఉన్న ప్రాంతాలు మొత్తం బూడిదమయమయ్యాయి.

ఆకాశంలో ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మిందంటే ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోపవ్‌లావ్‌స్కీ- కమ్‌చట్‌స్కీ పలు ప్రాంతాలు బూడిదమయం అయ్యాయి. ఈ మార్గంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించినట్లు రష్యన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories