అలవాటు బలి తీసుకుంది !

అలవాటు బలి తీసుకుంది !
x
Highlights

చాలా కాలంగా ఉన్న అలవాటు అతని ప్రాణాల మీదలకు వస్తుందని అనుకోనివుండడదు. నిద్రలో నడిచే అలవాటు అతన్ని బలితీసుకుంది.

నిద్రలో నడుచుకుంటూ బిడ్డింగ్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. విజయనగరంలోని స్థానిక చైతన్య స్కూల్ వద్ద ఓ అపార్ట్ మెంట్‌లో ఐదో ఫ్లోర్లో నివాసముంటున్న పవన్ కుమార్‌కు నిద్రలో నడిచే అలవాటు ఉంది. అయితే గత శుక్రవారం రాత్రి కూడా నిద్రలో నడుస్తూ తన అపార్ట్ మెంట్‌లోని ఐదో ఫోర్ల్ నుంచి బయటకు వచ్చాడు.

అయితే నిద్రలో నడుచుకుంటూ వచ్చిన పవన్ కుమార్ ఐదో ఫోర్లోనుంచి కాలు జారీ కింద పడిపోయాడు. అతను పెద్దగా కేకేలు వేయడంతో అందరూ బయటకు వచ్చి చూసేసరికి. కింద పడిపోయి ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పవన్ కుమార్ తల్లి దండ్రులు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories