సంచలనం : ట్రంప్‌కు విరుగుడు లేని విషం..

సంచలనం : ట్రంప్‌కు విరుగుడు లేని విషం..
x
Highlights

దేశ అత్యున్నత ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) నుండి సహాయం కోరుతున్నట్టు అధికారి ఒకరు ధృవీకరించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఆర్‌సిఎంపి ఎఫ్‌బిఐతో కలిసి పనిచేస్తుందని ఆర్‌సిఎంపి చెప్పింది..

అమెరికాలోని అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్ హౌస్ వద్ద ఒక కవరును అధికారులు గుర్తించారు, కెనడా నుండి పంపినట్లు కనిపిస్తున్న ఈ కవర్ లో రిసిన్ అనే పదార్ధం ఉంది.. అది అత్యంత ప్రమాదకరమైన విషం అని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సిఎంపి) శనివారం తెలిపింది. దానిని స్పీకరించిన 30 గంటలలోపు మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీనికి విరుగుడు కూడా కనిపెట్టలేదని తెలుస్తోంది. దీనిని గుర్తుతెలియని వ్యక్తులు వైట్‌హౌస్‌ లోని ట్రంప్ కు పంపించాలని ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే కవరు వైట్ హౌస్ వద్దకు రాకముందే ప్రభుత్వ మెయిల్ సెంటర్ వద్ద అధికారులు అడ్డుకున్నారు. ఈ అనుమానాస్పద కవర్ కు సంబంధించి దర్యాప్తు కోసం దేశ అత్యున్నత ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) నుండి సహాయం కోరుతున్నట్టు అధికారి ఒకరు ధృవీకరించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఆర్‌సిఎంపి ఎఫ్‌బిఐతో కలిసి పనిచేస్తుందని ఆర్‌సిఎంపి ప్రతినిధి చెప్పారు.

అయితే దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించడానికి మాత్రం నిరాకరించారు. అలాగే వైట్ హౌస్ మరియు యుఎస్ సీక్రెట్ సర్వీస్ దీనిపై స్పందించడానికి నిరాకరించాయి. ఈ సమయంలో, ప్రజల భద్రతకు ఎటువంటి ముప్పు లేదు అని ఎఫ్బిఐ తెలిపింది. కాగా గతంలో కూడా ఈ తరహా ప్రయోగానికి కొందరు వ్యక్తులు తెరతీశారు. అయితే ఆ సమయంలో దోషులగా తేలిన వారికి స్థానిక కోర్టు కఠిన శిక్షను ఖరారు చేసింది. అలాగే జూలై 2014 లో, ఒబామా అలాగే న్యూయార్క్ మాజీ మేయర్ మైఖేల్ బ్లూమ్బెర్గ్ లకు మెయిలింగ్ కవర్లు పంపించడంతో టెక్సాస్ నటుడికి 18 సంవత్సరాల జైలు శిక్ష పడింది. తాజాగా అధ్యక్ష ఎన్నికల ముందు ఇలాంటి ఘటన జరగడం వైట్ హౌస్ అధికారులను కలవరపెడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories