లెబనాన్ పేజర్ల పేలుళ్లు: కేరళ వాసికి లింకు?

Lebanon pager blast link to Kerala resident?
x

లెబనాన్ పేజర్ల పేలుళ్లు: కేరళ వాసికి లింకు?

Highlights

హంగేరీ రాజధాని బుడాపెస్ట్ కేంద్రంగా పనిచేస్తున్న బీఏసీ కన్సల్టింగ్ సంస్థ తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో సంస్థ ట్రేడ్ లైసెన్స్ ను ఉపయోగించుకుంది.

లెబనాన్ లో పేలుళ్లకు కేరళలో జన్మించిన రిన్సన్ జోస్ కు సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మేరకు హంగేరికి చెందిన టెలెక్స్ అనే వార్తాసంస్థ ఓ కథనం ప్రచురించింది. బల్గేరియాలోని సోఫియాలోని నోర్టా గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టెన్సీ తమ వెబ్ సైట్ ను సెప్టెంబర్ 19న తొలగించింది. ఈ కార్యాలయానికి సంబంధించిన అడ్రస్ లో ఆ కార్యాలయమే లేదు. దీనిపై బల్గేరియన్ జాతీయ భద్రతా సంస్థ దర్యాప్తు ప్రారంభించింది.

హంగేరీ రాజధాని బుడాపెస్ట్ కేంద్రంగా పనిచేస్తున్న బీఏసీ కన్సల్టింగ్ సంస్థ తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో సంస్థ ట్రేడ్ లైసెన్స్ ను ఉపయోగించుకుంది. ఈ సంస్థ ఏఆర్ -924 మోడల్ పేజర్లను తయారు చేశారు. బల్గేరియా రాజధాని సోఫియా కేంద్రంగా పనిచేస్తున్న నోర్టా గ్గోలబ్ సంస్థ వీటిని సరఫరా చేసింది. సోఫియాలో నోర్టా గ్లోబల్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు రిన్సన్ జోస్. లెబనాన్ కు సరఫరా చేసిన పేలుడు పదార్ధాలతో పాటు బ్యాటరీని వెడెక్కించేలా మాల్ వేర్, స్పైవేర్ అప్ లోడ్ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. దీంతోనే ఏకకాలంలో పేజర్లు పేలాయి.

పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు జోస్ కుటుంబాన్ని కేరళలోని రిన్సన్ స్వంత గ్రామం ఒండయంగడిలో సోదాలు నిర్వహించారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కథనం తెలిపింది. టైలర్ మూతేదత్ జోస్, గ్రేసీల కుమారుడు రిన్సన్. తన భార్యతో కలిసి ఆయన నార్వేలో ఉంటున్నారు. అతని సోదరుడు యుకేలో పనిచేస్తున్నారు. అతని సోదరి ఐర్లాండ్ లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా ఆ కుటుంబం తమతో టచ్ లో లేదని అతని మామా థంకచన్ తెలిపారు. ఈ విషయమై నార్వే గూఢచార సంస్థ పీఎస్ టీ , ఓస్లో పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తున్నారు.

లెబనాన్‌లో హిజ్బుల్లా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పేజర్లను పేల్చారు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరియాలో జరిగిన ఇలాంటి పేలుళ్లలో 14 మంది చనిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories