America: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం

Launch of 5G Services in America | International News Today
x

అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం

Highlights

America: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం

America: అమెరికాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. అమెరినా నుంచి వెళ్లే లేదా అమెరినా రావాల్సిన మొత్తం 538 విమానాలు 5జీ సేవలు ప్రారంభమవడం కారణంగా రద్దు కానున్నాయని నివేదికలు వచ్చాయి. అయితే బుధవారం నాడు కేవలం 215 విమానాల మాత్రమే రద్దయ్యాయి. వీటిలో ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ANA, జపాన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలున్నాయి.

విమానయాన సంస్థల అభ్యంతరాలతో అమెరికాలోని కొన్ని ఎయిర్‌పోర్టుల చుట్టూ 5జీ సర్వీసుల ప్రారంభాన్ని ఏటీ అండ్ టీ, వెరిజన్ టెలికాం సంస్థలు తాత్కాలికంగా నిలిపివేశాయి. మిగిలిన చోట్ల సేవల్ని ప్రారంభించినట్లు ఆ సంస్థలు తెలిపాయి. అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్‌ చేశాయి. ఎయిరిండియా సైతం అమెరికాకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి. అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories