US Election Counting: కమలా వర్సెస్ ట్రంప్..18 రాష్ట్రాల్లోట్రంప్ ..9 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ విజయం

US Election Counting: కమలా వర్సెస్ ట్రంప్..18 రాష్ట్రాల్లోట్రంప్ ..9 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ విజయం
x
Highlights

US Election Counting: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ట్రంప్ అత్యధిక రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు.

US Election Counting: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూసినట్లయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా 18 రాష్ట్రాల్లో గెలుపొందారు. దీంతో ట్రంప్ నకు 188 ఎలక్టోరల్ సీట్లు వచ్చాయి.

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రస్తుతం 9 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఆమెకు ఇల్లినోయి, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మొంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్ రాష్ట్రాల్లోని 99 సీట్లు లభించాయి.

అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా ఎదురీదుతున్నారు. 2020 ఎన్నికల్లో ఈ స్టేట్ డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకువచ్చింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్ బర్గ్, ఫిలడెల్ఫియాలో కమలా ముందున్నారు. దీంతో ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories