2024 US Elections: ఉత్కంఠగా మారిన అమెరికా అధ్యక్ష పోరు.. కమలా హ్యారిస్‌కు పెరుగుతున్న మద్దతు

Kamala Harris Cuts Down Donald Trumps Lead
x

2024 US Elections: ఉత్కంఠగా మారిన అమెరికా అధ్యక్ష పోరు.. కమలా హ్యారిస్‌కు పెరుగుతున్న మద్దతు

Highlights

2024 US Elections: డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌‌ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి.

2024 US Elections: డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌‌ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి. పార్టీలో ఆమెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుండగా ట్రంప్‌తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు. బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో రిపబ్లికన్‌ పార్టీకి, డెమోక్రటిక్‌ పార్టీకి 6శాతం ఓట్ల తేడా ఉండగా ఇప్పుడది 1శాతానికి తగ్గిపోయింది. న్యూయార్క్‌ టైమ్స్, సియానా కళాశాల సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బైడెన్‌ వైదొలిగిన తర్వాత నిర్వహించిన ఈ సర్వే నిన్న విడుదలైంది.

గతంలో బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా అభ్యర్థి ఎవరనే విషయంలో సర్వే జరగ్గా.. కేవలం 14 శాతం మందే హారిస్‌కు మద్దతిచ్చారు. ప్రస్తుతం 93శాతం మంది డెమోక్రాట్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. రిపబ్లికన్లలో అంతే శాతం ట్రంప్‌ వెంట ఉన్నారు. తాజా పోల్‌లో అమెరికా ఓటర్లలో 48శాతం మంది ట్రంప్‌నకు మద్దతివ్వగా.. హారిస్‌కు 47శాతం మంది అండగా నిలిచారు. అంటే కేవలం 1 శాతం తేడాయే ఇద్దరి మధ్య ఉంది. అదే బైడెన్‌ హయాంలో ఈ తేడా 6శాతం ఉండేది. ముఖ్యంగా 30ఏళ్ల లోపు యువత హారిస్‌కు భారీగా మద్దతిస్తున్నారు. 45ఏళ్ల లోపు వయసు వారిలో 10శాతం అధికంగా ఆమెకు అండగా నిలుస్తున్నారు. రిజిస్టర్డ్‌ ఓటర్లలో ట్రంప్‌నకు 48 శాతం, హారిస్‌కు 46శాతం మద్దతు లభించింది. అదే బైడెన్‌ అభ్యర్థిగా ఉన్నప్పుడు 9శాతం తేడా ఉండేది.

డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తూ శనివారం కమలా హారిస్‌ సంతకం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ సంతకం చేశానని.. ప్రతి ఓటునూ సాధించడానికి కష్టపడి పని చేస్తానని అన్నారు. ప్రజలు తన తరఫున చేసే ప్రచారంతో నవంబరు 5న జరిగే ఎన్నికల్లో గెలుస్తానని ఈ సందర్భంగా ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

మరో వైపు ట్రంప్‌ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. డెమోక్రాటిక్ తరుపున కమలా పోటీ చేస్తే తన గెలుపు ఇంకా సులభమవుతుందని ఈ మధ్యే హాట్ కామెంట్స్ చేసిన ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని ట్రంప్‌ ప్రకటించారు.

అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా చరిత్రలో మిగిలిపోతారని రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు. హారిస్‌ ప్రజాదరణ కోల్పోయారని అన్నారు. దేశ ఉపాధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని... ఎంతోమంది అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్నా అడ్డుకోలేదని ఆరోపించారు. హారిస్‌ ఓ విఫల వైస్ ప్రెసిడెంట్ అంటూ ట్రంప్ ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories