ప్రతీ నిరుద్యోగికి 2వేల డాలర్ల ఆర్థిక సాయం.. అమల్లోకి బైడెన్‌ ఆర్థిక ప్రణాళిక

Joe Biden
x

Joe Biden

Highlights

*కరోనాతో నష్టపోయిన వర్గాలకు ఊరట *నిరుపేదలకు కనీస వేతనం కింద గంటకు 15 డాలర్లు *చిన్న వ్యాపారులు, అత్యవసర సేవకులకు సహాయం

కరోనా కారణంగా అతలాకుతలమైనా ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అధ్యక్షుడు జో బైడెన్‌ పలు కార్యనిర్వహక ఉత్తర్తులను జారీ చేశారు. మొత్తం కోటి 8లక్షల మంది నిరుద్యోగులుగా మారడంతో వారిని ఆదుకోవడానికి చర్యలు చేపడూ ప్రణాళికను రూపొందించారు. ప్రతీ నిరుద్యోగికి 2వేల డాలర్లు ఆర్థిక సాయం ఇవ్వనుండగా.. ఇప్పటికే 600 డాలర్లు ఇచ్చారు. మిగిలిన 1400 డాలర్లను వెంటనే అందివ్వాలని ఆదేశాలు చేశారు. అదేవిధంగా నిరుద్యోగ బీమా కింద ఇస్తున్న సౌకర్యాల కాలపరిమితిని మరికొంతకాలం పాటు పెంచనున్నారు.

అద్దెలు చెల్లించలేక చాలా మంది ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తుండడంతో అలా జరగకుండా చూడాలని బైడెన్‌ అధికారులను ఆదేశించారు. చిన్న వ్యాపారులు, అత్యవసర సేవలకు సహాయం అందించాలన్నారు. నిరుపేదలైన వారికి కనీస వేతనం కింద గంటకు 15 డాలర్లు చెల్లించాలన్నారు. అటు దేశంలో తలెత్తిన అంతర్గత తీవ్రవాదంపై బెడెన్‌ వివిధ భద్రత విభాగాలతో సమీక్షించనున్నారు. వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వాలని అంతర్గత భద్రత విభాగాలను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories