Joe Biden: ఐసీస్ నేతలను హతమార్చాలని ఆర్మీకి జో బైడెన్ ఆదేశం

Joe Biden Warning to ISIS Leaders about Kabul Airport Human Bomb Explosion Attack | Kabul Airport News
x

ఐసీస్ నేతలను హతమార్చాలని ఆర్మీకి జో బైడెన్ ఆదేశం

Highlights

Joe Biden: పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకుంటాం, సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టం- బైడెన్

Joe Biden: కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్‌ మానవ బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనల్లో 75 మంది చనిపోగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో జరిగిన పేలుళ్లను ప్రపంచ దేశాలు ఖండించాయి. కాబూల్ ఆత్మాహుతి దాడుల బాధిత కుటుంబాలకు యావత్ ప్రపంచం సంతాపం ప్రకటించింది. కాబుల్‌లో పేలుళ్లను భారత్, అమెరికా దేశాలు తీవ్రంగా ఖండించాయి. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన భారత్‌, ఉగ్రవాదులకు సహకరించే వారికి వ్యతిరేకంగా.. ప్రపంచం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని తెలిపింది.

బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ దాడిని అంతతేలికగా తాము మరిచిపోమని... ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన.. మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనం పాటించారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్‌.. సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. అయితే ఈ దాడి తరలింపు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపబోదని, అనుకున్న గడువులోపు తాలిబన్ల సహకారంతో సైన్యం-పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని బైడెన్‌ స్పష్టం చేశారు. తాము శాంతిని కొరుకుంటున్నామని ప్రకటించుకున్న తాలిబన్లు.. పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories