Japan Rocket: జపాన్‌లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం

Japan First Private Rocket Launch Fails
x

Japan Rocket: జపాన్‌లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం

Highlights

Japan Rocket: రాకెట్‌ను నిర్మించిన టోక్యోకు చెందిన స్పేస్ వన్ సంస్థ

Japan Rocket: జపాన్‌ ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌ నుంచి రాకెట్‌ను ప్రయోగించిన కొన్ని సెకన్లలోనే పేలిపోయింది. దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకుని నింగికి ఎగిరింది. కానీ కొన్ని క్షణాల్లోనే ఇది పేలుడుకు గురై గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది. టోక్యోకు చెందిన స్పేస్ వన్ సంస్థ ఈ రాకెట్‌ను నిర్మించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే... ఆ దేశంలో శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డు సృష్టించేంది. రాకెట్ లాంచింగ్ ప్రయ్కరియ సజావుగానే సాగినా... ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేసేందుకు ప్రయత్నించడంతోనే ఇలా జరిగిందని సంస్థ చెప్పుకొచ్చింది. అయితే ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories