*వినోద, వాణిజ్య, సినిమా ప్రకటనలకు... శిల్పాలు, ప్రత్యేక దుస్తులను తయారుచేస్తున్న జెప్పేట్
Japanese Man: కోలి ఈ జాతి శునకం ఎంతో అందంగా ఉంటుంది. చూడగానే చాలా మంది ఈ శునకరాజాన్ని ఇష్టపడుతారు. ఇప్పుడు మీరు చూస్తున్న శునం కూడా కోలి జాతికి చెందినదే అయితే ఇది నిజమైన శునకం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అది శునకం కాదు టోకో ఈవీ అనే జపాన్ వ్యక్తి. అవాక్కవుతున్నారా?? అవును ఇది నిజం జంతువులా మారాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి శునకంలా మారాడు. అందుకు అతడు అక్షరాల 12 లక్షల రూపాయలను వెచ్చించాడు. ఇప్పుడు అతడిని చూసి నెటిజన్లు సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఇలా పూర్తి శునకంలా కనిపించేందుకు టోకో ఈవీ భారీగా ఖర్చు చేయగా నిపుణులు 40 రోజుల పాటు కష్టపడ్డారు.
జపాన్‌కు చెందిన జెప్పెట్ అనే సంస్థకు సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం వినూత్నమైన శిల్పాలను, మస్కట్ పాత్రల దుస్తులను తయారుచేయడంలో మంచి పేరుంది. జంతువులా మారాలన్న తన కోరికను జెప్పెట్ సంస్థకు టోకో ఈవీ తెలిపాడు. ఎంత ఖర్చైనా భరిస్తానని చెప్పడంతో అందుకు ఆ సంస్థ అంగీకరించింది. 40 రోజుల పాటు శ్రమించి ఈవీని కోలీ జాతి శునకంలా మార్చారు. ఇప్పుడు టోకో ఈవీ అచ్చం శునకంలాగే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈవీని చూస్తే శునకమనే అనుకుంటారు. ఈవీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈవీని చూసి నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.
【制作事例 追加】
— 特殊造型ゼペット (@zeppetJP) April 11, 2022
犬 造型スーツ
個人の方からのご依頼で、犬の造型スーツを制作しました。
コリー犬をモデルにしており、本物の犬と同様に四足歩行のリアルな犬の姿を再現しております🐕
詳細はこちら:https://t.co/0gPoaSb6yn#犬 #Dog #着ぐるみ#特殊造型 #特殊造形 pic.twitter.com/p9072G2846
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire