Israel: యెమెన్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం..

Israeli Jets Strike Yemen Rebels After Deadly Attack On Tel Aviv
x

Israel: యెమెన్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం..

Highlights

Israel: తొలిసారి హౌతీలపై దాడికి దిగిన ఇజ్రాయెల్

Israel: తమ దేశంపై తరచూ దాడులకు పాల్పడుతున్న హౌతీలపై ప్రతీకార దాడులకు దిగింది ఇజ్రాయెల్‌. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్‌పై పలుమార్లు దాడులకు దిగిన హౌతీ రెబల్స్ శుక్రవారం టెల్ అవీవ్‌పై సూసైడ్ బాంబ్ అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రతీకారంగా శనివారం హౌతీ రెబల్స్‌‌కు పట్టున్న అల్ హొదైదా పోర్టుపై దాడి చేసింది ఇజ్రాయెల్. మెరుపు దాడులకు దిగిన ఇజ్రాయెల్.. పోర్టుపై బాంబుల వర్షం కురిపించింది. టెల్‌ అవీవ్‌పై దాడికి ప్రతిగానే ఈ దాడిచేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. తమ దేశంపై దాడులు చేస్తే ఎవరిపై అయినా తిరిగి తాము దాడులు చేసేందుకు వెనుకాడబోమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories