Israel : పాఠశాలలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం..20 మంది మృతి

Israeli army attack on Gaza schools kills 20
x

Israel:పాఠశాలలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం..20 మంది మృతి

Highlights

Israel : గాజా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. నిరాశ్రుయులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలలపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 20 మంది పాలస్తీయన్లు మరణించారు.

Israel : ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని రెండు పెద్ద నగరాలపై దాడి చేసింది. ఈ దాడిలో 20 మంది పాలస్తీయన్లు మరణించారు. ఈ దాడి ఆదివారం జరిగింది. సెంట్రల్ గాజాలోని డీర్ అల్-బలాహ్ నగరంలో మొదటి దాడి జరిగింది. ఇక్కడ అల్ అక్సా హాస్పిటల్ సమీపంలోని టెంట్ క్యాంపుపై IDF భారీ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు పాలస్తీనియన్లు మరణించగా, పలువురు గాయపడ్డారు. రెండవ దాడి ఉత్తర గాజాలోని షేక్ రాజ్వాన్‌లో జరిగింది. IDF హమామా పాఠశాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో 16 మంది మరణించగా, దాదాపు 21 మంది గాయపడ్డారు. ఈ దాడిలో గాయపడిన క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు.

టెల్ అవీవ్ శివారులో ఓ పాలస్తీనా మిలిటెంట్ కత్తితో జరిపిన దాడుల్లో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్ాయయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో జరిగిన రెండు దాడుల్లో స్థానిక హమాస్ కమాండర్ తో సహా 9మంది ఉగ్రవాదులు హతమైనట్లు హమాస్ తెలిపింది. మరణించినవారిలో ఒకరు తుల్కర్మ్ బ్రిగేడ్స్ కమాండర్ అని..మిగతా వారు ఇస్లామిక్ జిహాద్ సమ్మెకు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారని తెలిపింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం క్రమంలో వెస్ట్ బ్యాంకులో హింసాత్మక ఘటన పెచ్చుమీరుతున్నాయి. ఇరాన్, లెబనాన్ కుచెందిన హిజ్బుల్లా గ్రూప్ తో ఇజ్రాయెల్ కు వివాదం తారా స్థాయికి చేరుతోంది.

ఈ క్రమంలోనే పాలస్తీనా భూభాగాల్లో తాజాగా దాడులు జరిగాయి. గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ఆధారంగా గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 39వేల మంది 550 మంది పాలస్తీయన్లు మరణించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ దాడిలో 12వందల మంది మరణించారు. 250 మంది కిడ్నాప్ కు గురయ్యారు.

Israeli army attack on Gaza schools kills 20కాగా అక్టోబర్ 7, 2023 నుండి, గాజాలో ఇజ్రాయెల్ దాడులు నిరంతరం జరుగుతున్నాయి. ఆదివారం, మరోసారి ఇజ్రాయెల్ సైన్యం అకస్మాత్తుగా వైమానిక దాడి చేసింది. ఇందులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు, 10 నెలల్లో సుమారు 40 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. అదే సమయంలో 23 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories