Israel War On Gaza: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 45 మంది మృతి! 42000 దాటిన మృతుల సంఖ్య

Israel War On Gaza: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 45 మంది మృతి! 42000 దాటిన మృతుల సంఖ్య
x
Highlights

Israel War On Gaza: ఇజ్రాయెల్ మరోసారి గాజాపై వైమానిక దాడులు తీవ్రం చేసింది. గాజాలో తాజాగా జరిపిన ఎయిర్ స్ట్రైక్స్‌లో గత 24 గంటల వ్యవధిలోనే 45 మంది...

Israel War On Gaza: ఇజ్రాయెల్ మరోసారి గాజాపై వైమానిక దాడులు తీవ్రం చేసింది. గాజాలో తాజాగా జరిపిన ఎయిర్ స్ట్రైక్స్‌లో గత 24 గంటల వ్యవధిలోనే 45 మంది చనిపోయారు. తాజా దాడులతో 2007 లో ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుండి పాలస్తినాలో చనిపోయిన వారి సంఖ్య 42 వేలు దాటింది. గాజాలోని జబాలియాను స్థావరంగా చేసుకుని హమాస్ దాడులు జరుపుతోందనిఇజ్రాయెల్ చెబుతోంది. అందుకే భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను నివారించేందుకు తామే ముందుగా జబాలియా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నట్లుగా ఇజ్రాయెల్ బలగాలు చెబుతున్నాయి. జబాలియాను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా పాలస్తినా పౌరులకు ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది. అయితే, పారిపోవడానికి గాజాలో సురక్షిత ప్రదేశం అంటూ ఎక్కడా లేదని పాలస్తినా, ఐక్య రాజ్య సమితి అధికారులు తెలిపారు. గాజాలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొందో చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇజ్రాయెల్ దాడుల్లో జబాలియాలో డజన్లలో జనం చనిపోయినట్లుగా అస్పష్టమైన సమాచారం అందుతోంది. కానీ ఇజ్రాయెల్ వరుసగా కురిపిస్తోన్న బాంబుల వర్షంతో ఆ సమాచారాన్ని ధృవీకరించుకునే వీల్లేకుండా పోయిందని పాలస్తినా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ ఆందోళన వ్యక్తంచేసింది.

గాజా నగరంతో పాటు ఉత్తర గాజాను కూడా ఖాళీ చేసి దక్షిణ ప్రాంతానికి పారిపోవాల్సిందిగా ఇజ్రాయెల్ ఈ దాడులు మొదలుపెట్టిన కొత్తలోనే ప్రకటించింది. అప్పట్లోనే భారీ సంఖ్యలో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు, ఊర్లు విడిచి దక్షిణ ప్రాంతానికి వెళ్లి అక్కడి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ గాజాలో ఇంకా వేలమంది జనం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇజ్రాయెల్ మరోసారి అదే ప్రకటన విడుదల చేసి మరీ దాడులు తీవ్రం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories