Iran vs Israel War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్ళ వర్షం... మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా?

Iran vs Israel War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్ళ వర్షం... మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా?
x

ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్ళ వర్షం... మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా?

Highlights

Iran vs Israel War: మధ్యఆసియాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణదాడులతో విరుచుకుపడింది. దీంతో దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగాయి.

Iran vs Israel: ఇరాన్ మంగళవారం నాడు ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ మిసైళ్ళతో దాడి చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఈ దాడుల నుంచి రక్షణ కోసం ప్రజలు ఇప్పటికే బంకర్లలో తలదాచుకున్నారని ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

ఇరాన్ మిసైల్ దాడులతో ఇజ్రాయెల్‌ ముప్పేట దాడిలో చిక్కకున్నట్లైంది. ఇప్పటికే, ఏడాది కాలంగా గాజాలో హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్, ఇటీవల లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులు ముమ్మరం చేసింది. గతవారం హిజ్బుల్లా చీఫ్ హసన నస్రల్లా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్ మంగళవారం నాడు ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది.


భారత్ అప్రమత్తం

ఇరాన్ మిసైల్ దాడులపై స్పందించిన భారత్, ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడికీ ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. రక్షణ షెల్టర్లకు దగ్గరలో ఉండాలని, పరిస్థితిని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేస్తోందని టెల్-అవీవ్‌లోని భారత ఎంబసీ ప్రకటించింది.

అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. హెల్ప్ లైన్ నంబర్లు, ఇమెయిల్ ఈ దిగువ ఇచ్చిన ఎంబసీ ట్వీట్లో ఉన్నాయి.


ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడి

ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్‌ ఇప్పుడు మూడు వైపుల నుంచి యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్ దాడుల వల్ల కొంత మంది గాయపడ్డారని చెప్పిన ఇజ్రాయెల్, దీనికి ప్రతీకార దాడులు ఉంటాయని ప్రకటించింది.

ఇరాన్ పేల్చిన మిసైళ్ళలో చాలా వాటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ గాలిలోనే పేల్చివేసింది. కొన్ని క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో పడ్డాయని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. సైరన్ల మోత వినిపించడం, ఆకాశంలో నిప్పులు పేలుతున్న దృశ్యాలు కనిపించడంతో స్థానికులు వెంటనే బాంబు షెల్టర్లలోకి వెళ్లారని ప్రకటించింది.

లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్

ఇరాన్ అండదండలతో కార్యకలాపాలు సాగిస్తున్న హిజ్బుల్లా మిలిషియాను అంతం చేయడానికి ఇజ్రాయెల్ ఇటీవల లెబనాన్‌పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగింది. మంగళవారం రోజంతా లెబనాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించింది. ఇజ్రాయెల్ సేనలు లెబనాన్‌లోకి చాలా దూరం చొచ్చుకుపోయాయి. దీంతో, ఇరాన్ కూడా అదే రోజు ఇజ్రాయెల్ మీద మిసైల్ వార్ ప్రారంభించింది.

హమాస్ మీద దాడులు ఆపేంతవరకు ఇజ్రాయెల్‌పై రాకెట్లు పేల్చుతూనే ఉంటామన హిజ్బుల్లా ప్రకటించింది. దీనికి ఇరాన్ కూడా మద్దతు తెలిపింది. ఇప్పుడు ఇరాన్ వందల రాకెట్లతో విరుచుకుపడడంతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి.

ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది...

'ఇరాన్ దాడులు యుద్ధ తీవ్రతను దారుణంగా పెంచాయి. మేం సరైన సమయంలో, సరైన విధంగా బదులిస్తాం. ఇజ్రాయెల్ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎక్కడ దాడి చేయాలో అక్కడ చేస్తాం' ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ - ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ అన్నారు.


అమెరికా ఏమంటోంది?

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌కు అమెరికా ‘పూర్తి మద్దతు’ ఇస్తందని, ఇరాన్ విషయంలో ఎలా స్పందించాలనే విషయమైన మిత్ర దేశాలతో చర్చిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా దీనిపై బుధవారం నాడు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ, ‘ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది. దానికి అది మూల్యం చెల్లించక తప్పదు’ అని అన్నారు.

ఇజ్రాయెల్ దీనికి ప్రతీకారంగా ఇరాన్‌లోని న్లూక్లియర్ స్థావరాలపై దాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని అమెరికా డిఫెన్స్ వర్గాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories