iPhone 16: అక్కడ ఐఫోన్ 16 నిషేధం..తలలు పట్టుకుంటున్న టూరిస్టులు
iPhone 16: ఈమధ్యే విడుదల చేసిన యాపిల్ ఐఫోన్ 16పై ఇండోనేషియా నిషేధం విధించింది. యాపిల్ పెట్టుబడి హామీలను నెరవేర్చలేదని ప్రభుత్వం ఆరోపించింది. దీని కారణంగా ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న టూరిస్టులకు పెద్ద సమస్యగా మారింది.
iPhone 16: ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయ్యింది. కానీ అంతలోనే ఇండోనేషియాలో ఈ ఫోన్ పై నిషేధం విధించింది. అంతేకాదు... ఆ దేశంలో ఉన్న ఐఫోన్ 16 చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఐఫోన్ 16 విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆ దేశం నిర్ణయించింది. దీంతో ఆ దేశంలో పర్యటించేందుకు వెళ్దామని భావిస్తున్న టూరిస్టులకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.
ఇండోనేషియాలో ఐఫోన్ 16పై నిషేధం విధిస్తున్నట్లు అక్కడి పరిశ్రమల శాఖ మంత్రి గుమివాంగ్ కర్తసస్మిత తాజాగా ప్రకటించారు. ఇండోనేషియాలో ఆ ఫోన్ వాడేందుకు ఐఎంఈఐ సర్టిఫికేషన్ లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా వాడినట్లయితే అది అక్రమమే అవుతుందన్నారు. అలాంటి ఉదంతాలు ఏమైనా ఉంటే తెలపాలని ప్రజలను కోరారు.
ఇండోనేషియాలో పెట్టుబడికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో యాపిల్ సంస్థ విఫలమవ్వడంతోనే అక్కడి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 1.71 మిలియన్ రూపాయలను పెట్టుబడి పెడతామని యాపిల్ హామీ ఇచ్చింది 1.48 మిలియన్ రూపాయలను మాత్రమే పెట్టుబడి పెట్టిందని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.
యాపిల్ తన బాధ్యతలను మరిచిపోవడంతోనే ఐఫోన్ 16పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. ఇండోనేషియాలో విక్రయించాలంటే 40శాతం స్థానికంగా తయారు చేయాలన్న నిబంధన ఉండగా..అది అందుకోవడంలో యాపిల్ విఫలమవ్వడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.
Indonesia 🇮🇩 bans iPhone 16 sales, calling them “illegal” due to Apple’s missed local content and investment requirements. Apple invested 1.48 trillion rupiah, short of the 1.71 trillion target, with its domestic content certification still awaiting renewal. pic.twitter.com/2Q2fxrRJsm
— U S M A N ⚓️ (@usmansays56) October 25, 2024
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire