హృదయం ఉంటే కన్నీరు కూడా సలసల కాగే విషాధం వీరిది..

హృదయం ఉంటే కన్నీరు కూడా సలసల కాగే విషాధం వీరిది..
x
Highlights

ఈ సమాజంలో వారిని ఏ ఒక్కరు సాటి మనుషులుగా భావించరు. జీవితంలో వెలుగులు కరువైన చీకటి బతుకులవి. హృదయం ఉంటే కన్నీరు కూడా సలసల కాగే విషాధం వీరిది. అతికొద్ది...

ఈ సమాజంలో వారిని ఏ ఒక్కరు సాటి మనుషులుగా భావించరు. జీవితంలో వెలుగులు కరువైన చీకటి బతుకులవి. హృదయం ఉంటే కన్నీరు కూడా సలసల కాగే విషాధం వీరిది. అతికొద్ది మంది తప్ప.. ఎవరూ కావాలని ఆ వృత్తిని ఎంచుకోరు.. వారే సెక్స్ వర్కర్స్.. ఈ నిశీధి పద్మవ్యూహంలోకి వచ్చి చిక్కుకుపోయి అక్కడే బతుకీడుస్తున్నారు.. పొట్ట నింపుకోవడానికి ఈ ఊబిలో దిగేవారు కొందరైతే.. జీవితంలో మోసానికి గురై చిక్కుకుపోయేవారు మరికొందరు. సెక్స్ వర్కర్లు.. సమాజంలో హీనమైన జీవితాన్ని గడుపుతున్నారన్నవిషయాన్నీ మాత్రం ఎవరూ గుర్తించరు. నేడు అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే..

ఇవాళే దీనిని జరుపుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. 2 జూన్ 1975 న, సుమారు 100 మంది సెక్స్ వర్కర్లు తమపై నేరపూరిత, దోపిడీ జీవన పరిస్థితుల గురించి తమ కోపాన్ని వ్యక్తం చేయడానికి ఫ్రాన్స్‌లోని లియోన్‌లోని సెయింట్-నిజైర్ చర్చిని ఆక్రమించారు. దాంతో జూన్ 10 న సాయంత్రం 5 గంటలకు చర్చిపై దళాలు దారుణంగా దాడి చేశాయి. ఇది హింసకు సైతం దారితీసింది. ఇందులో ఇద్దరు సెక్స్ వర్కర్లు కూడా హత్యగావించబడ్డారు. ఆ తరువాత ఈ చర్య జాతీయ ఉద్యమానికి నాంది పలికింది. కనుక దీనిని అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే గా వారు జరుపుకుంటారు.

ఈ వృత్తి అంటేనే సమాజంలో ఒక చులకన భావం ఉంటుంది. అయితే ఈ రొంపిలోకి దిగడానికి గల కారణాలు విశ్లేషించుకుంటే మాత్రం కడుపు తరుక్కుపోతుంది. ముఖ్యంగా పేదరికం కారణంగా ఎక్కువమంది ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు.. తాగుడుకు బానిసైన భర్తల ద్వారా, కుటుంబ పోషణ కోసం, ఇతర వ్యక్తుల ద్వారా మోసపోయి కొందరు మహిళలు తమ జీవితాలను దుర్భరంగా మార్చుకుంటున్నారు.

పొట్టకూటి కోసం తానొక శవమై.. కామాంధుల ఆకలిని తీర్చే దారుణ వృత్తిలో తమ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగిపోతున్న అభాగ్య జీవుల గుండెచప్పుళ్లు అన్నీఇన్నీ కావు. ఈ రొంపిలోనుంచి బయటికొచ్చి గౌరవంగా పనిచేసుకు బ్రతకాలన్నా సాటి మనుషులుగా వారిని చూడని పరిస్థితి. అంతేకాదు వారిని ఎంతలా అవమానించాలో అంత చేసేస్తున్నారు. అయితే భూమిపై జీవించాలంటే దానికి వ్యభిచారం ఒక్కటే మార్గం కాదు.. కష్టపడే తత్వం, కృషి ఉంటేనే ఉన్నతస్థాయిలో స్థిరపడగలరని గుర్తించాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories