ఉక్రెయిన్‌లో కాల్పులు.. భారత విద్యార్థికి గాయాలు

Injuries to Indian student in Ukraine
x

ఉక్రెయిన్‌లో కాల్పులు.. భారత విద్యార్థికి గాయాలు

Highlights

Ukraine: ఉక్రెయిన్ - రష్యా మధ్య భీకర యుద్ధం

Ukraine: ఉక్రెయిన్‌ - రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు భారత విద్యార్థులను ఉక్రెయిన్‌ నుంచి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో రష్యా జరిపిన దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. రష్యా-ఉక్రెయిన్‌ జవాన్ల మధ్య జరుగుతున్న పోరులో దేశానికి చెందిన మరో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ వెల్లడించారు. కీవ్‌ను వీడి సరిహద్దులకు వస్తుండగా ఓ భారత విద్యార్థి కాల్పుల్లో గాయపడ్డాడు. సైనికుల మధ్య పోరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆ విద్యార్థిని కీవ్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు వీకే సింగ్‌ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories