Syria: పెంపుడు సింహానికి ఆహారంగా ఖైదీలు.. బయటకు వస్తున్న అసద్ అరాచకాలు

Syria: పెంపుడు సింహానికి ఆహారంగా ఖైదీలు.. బయటకు వస్తున్న అసద్ అరాచకాలు
x
Highlights

Syria: దేశం విడిచిపారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అరాచకాలు ఒక్కొక్కొటి బయటకు వస్తున్నాయి. ఆయన పాలనలో కొనసాగిన పైశాచిక చర్యలు వింటుంటే భయంతో...

Syria: దేశం విడిచిపారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అరాచకాలు ఒక్కొక్కొటి బయటకు వస్తున్నాయి. ఆయన పాలనలో కొనసాగిన పైశాచిక చర్యలు వింటుంటే భయంతో వణికిపోతున్నారు. తాజాగా మరో అరాచకం బయటకు వచ్చింది. తన పెంపుడు సింహానికి ఆహారంగా ఖైదీలు వేసేవాడని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకులకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. సైద్నాయ మిలటరీ జైలును ఏర్పాటు చేసి..మేమేం తక్కువ కాదన్నట్లు ఆయన నియంత పాలనలో అధికారులు కూడా పైశాచిక చర్యలరకు పాల్పడిన ఘటనలు ఎన్నో బయటకువస్తున్నాయి. అసద్ ఇంటెలిజెన్స్ విభాగంలోని కీలక అధికారి ప్రవర్తనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.

అసద్ టైగర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ లో కీలక అధికారి తలాల్ దక్కాక్. అతను ఖైదీలను తీసుకెళ్లి తన పెంపుడు సింహానికి ఆహారంగా వేసేవాడన్న విషయం బయటకు వచ్చింది. తనకు ఎదురుతిరిగిన వారందరికీ ఇదే శిక్ష విధించేవాడట. తాజాగా తిరుగుబాటు దారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో దక్కాక్ ను సిరియా పశ్చిమ ప్రాంతంలోని హమా పట్టణంలో బహిరంగంగా ఉరితీసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికార సమాచారం వెలువడలేదు.

దాదాపు 1500 మంది దక్కాక్ ఆధీనంలో పనిచేసేవారట. వీరందర్నీ అడ్డుపెట్టుకుని అసద్ అండదండలతో దక్కాక్ కీలకంగా ఎదిగాడు. సొంతంగా నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన అధికారాన్ని ఉపయోగించి 2005లో జూ నుంచి ఓ సింహాన్ని తీసుకువచ్చి..తనకు ఎదురుతిరిగినవాళ్లను ఆ సింహానికి ఆహారంగా వేసేవాడని తెలిసింది దక్కాక్ సాగించిన అరాచక కార్యకలాపాలు చాలానే ఉన్నాయి. బలవంతపు వసూల్లు, హత్యలు, కిడ్నాప్ లు అవయవ అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఈ నరరూప రాక్షసుడు అంతమైనట్లు తెలుసుకున్న హమా నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories