ఉక్రెయిన్‌లో భారతీయులకు హెచ్చరిక.. ఆ దేశాన్ని వీడాలని పిలుపునిచ్చిన భారత్‌ ఎంబసీ

Indian Embassy in Ukraine Asks Indians to Leave At the Earliest
x

ఉక్రెయిన్‌లో భారతీయులకు హెచ్చరిక.. ఆ దేశాన్ని వీడాలని పిలుపునిచ్చిన భారత్‌ ఎంబసీ

Highlights

Indian Embassy: *వీలైనంత త్వరగా వెళ్లాలని సూచనలు *ఉక్రెయిన్ ఎవరూ రావొద్దని పిలుపు

Indian Embassy: ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజు రోజుకు భయానకంగా మారుతున్నాయి. ఉక్రెయిన్‌పై నిత్యం ఇరాన్‌కు చెందిన సుసైడ్‌ డ్రోన్లతో రష్యా విరుచుకుపడుతోంది. ఏ ప్రాంతంపై ఏ డ్రోన్ వచ్చి దాడి చేస్తోందో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో పరిస్థితులు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత్‌ దౌత్య కార్యాలయం స్పందించింది. ఉక్రెయిన్‌లో భారతీయులు ఇంకా ఎవరైనా ఉంటే.. వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని కీవ్‌లోని భారత ఎంబసీ సూచించింది. ఆమేరకు తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉక్రెయిన్‌లో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నట్టు భారత ఎంబసీ వెల్లడించింది. దేశ్యవాప్తంగా దాడులు పెరుగుతున్నాయి. భారత పౌరులు ఎవరూ ఇక్కడికి రావొద్దని సూచించింది. ఉక్రెయిన్‌లో ఎవరైనా ఉంటే.. సాధ్యమైనంత త్వరగా.. అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించింది.

రష్యా, క్రిమియాను కలిపే కెర్చ్‌ వెంతనపై ఇటీవల భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడుతో వంతెన పాక్షికంగా దెబ్బతిన్నది. వంతెన పేలుడుకు ఉక్రెయినే కారణమని మాస్కో ఆరోపిస్తోంది. కెర్చ్ వంతెన పేలుడు జరిగిన తరువాత రోజే.. రష్యా భీకరంగా విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలపై ఏకంగా 84 క్షిపణులతో దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. నాటి నుంచి ఇరాన్‌కు చెందిన డ్రోన్లతో రష్యా దాడులను ఉధృతం చేస్తోంది. దీంతో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఈ యుద్ధలో మాస్కో అణ్వాయుధాలను ఉపయోగించే ముప్పు ఉందని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని పలు దేశాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్యా సరిహద్దులోని నాటో సైన్యం అణ్వస్త్రాలను ప్రదర్శించింది. దీంతో పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టింది. నిజానికి డాన్‌బాస్‌ ప్రాంతానికి విముక్తి కల్పించేందుకే.. తాము సైనిక చర్యకు దిగినట్టు రష్యా తొలుత ప్రకటించింది. కానీ డాన్‌బాస్‌ ప్రాంతంపై కొన్ని నెలల క్రితం మాస్కో పూర్తిగా పట్టు సాధించింది. కానీ.. అంతటి ఆగకుండా.. పూర్తిగా ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునే దిశగానే రష్యా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఉక్రెయిన్‌ ఎదురుదాడులతో పరిస్థితిలో మార్పు వచ్చింది. అదే సమయంలో సైన్యం భారీగా, మృత్యువాత పడడం.. ఆయుధాలు అయిపోవడంతో.. మాస్కో విలవిలలాడుతోంది. ఉక్రెయిన్‌ను నిలువరించడానికి అన్ని ప్రయత్నాలను చేస్తోంది. గత నెలలో రెఫరెండం తెచ్చిన క్రెమ్లిన్‌.. ఇప్పుడు మార్షల్‌లాను తొలిసారి తెరపైకి తెచ్చింది. మరోవైపు ఉక్రెయిన్‌ సైన్యం మాత్రం దూకుడును ప్రదర్శిస్తోంది. తాము కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారీగా దాడులకు తెగబడుతోంది. పుతిన్ సేనలను వెంటాడి.. వేటాడుతోంది. దీంతో పుతిన్ కలవరానికి గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories