Indian Army: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దు వద్ద నిఘా వ్యవస్థ పటిష్టం

Indian Army has Strengthened its Surveillance System at China Border in Arunachal Pradesh
x

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దు వద్ద నిఘా వ్యవస్థ పటిష్టం(ఫైల్ ఫోటో)

Highlights

* డ్రోన్లను రంగంలోకి దింపిన భారత సైన్యం * సరిహద్దు ప్రాంతాల్లో రుద్ర' హెలికాప్టర్ చక్కర్లు

Indian Army: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దు వద్ద భారత సైన్యం నిఘా వ్యవస్థను పటిష్ఠపరిచింది. రాత్రింబవళ్లు రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే డ్రోన్లను రంగంలోకి దింపారు. వీటిలో ఇజ్రాయెల్‌లో తయారైన హెరాన్‌ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇవి 35వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ 45 గంటల పాటు పనిచేస్తాయి. వీటిని ఉపగ్రహ కమ్యూనికేషన్‌ వ్యవస్థతో అనుసంధానం చేయడంతో క్షణాల్లో సమాచారం చేరవేస్తాయి.

గతేడాది లద్దాఖ్‌లో చైనా బలగాలు ప్రవేశించిన దగ్గర నుంచి వాస్తవాధీన రేఖ వద్ద గస్తీ ముమ్మరమయింది. కీలక, వ్యూహాత్మక ప్రాంతాల్లో వేగవంతంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎలాంటి దుస్సాహసం చేయకుండా చైనాను నిరోధించేందుకు నిఘాను పెంచారు. డ్రోన్లు కాకుండా అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ అయిన 'రుద్ర'ను కూడా సైన్యం మోహరించింది. ఇది ఆయుధాలను తీసుకువెళ్లే వెపన్‌ సిస్టం ఇంటిగ్రేటెడ్‌ లాంటివి కావడం విశేషం.

వాస్తవానికి హెరాన్‌ డ్రోన్లు నాలుగయిదేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. అయితే 'సెన్సార్‌ టు షూటర్ అన్న విధానం మేరకు వీటిని ఇతర నిఘా వ్యవస్థలతో అనుసంధానం చేశారు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనప్పుడు అతి తక్కువ సమయంలోనే బలగాలను మోహరించగలగడం ఈ విధానం ప్రత్యేకత. ఎత్తయిన ప్రదేశాలకు ఆయుధాలను తీసుకెళ్లే రుద్ర హెలికాప్టర్లు సైన్యానికి ఎంతో హెల్ప్‌ చేస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories