Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూక హింస.. కేంద్రం అలర్ట్‌

India Pakistan Ask Students In Kyrgyzstan To Stay Indoors Amid Mob Violence
x

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూక హింస.. కేంద్రం అలర్ట్‌ 

Highlights

Kyrgyzstan: పాకిస్థాన్‌కు చెందిన పలువురు విద్యార్థులు మృతి

Kyrgyzstan: కిర్గిస్థాన్‌ దేశంలో అల్లర్లు చెలరేగాయి. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగింది. కిర్గిస్థాన్‌, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్‌ కావడం దాడులకు దారి తీసింది. అక్కడ భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ విద్యార్థులు నివసించే బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లపై దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు కిర్గిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories