Syria Crisis: సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం.. కీలక ప్రకటన విడుదల చేసిన భారత్

India Issues Travel Advisory for Syria
x

Syria Crisis: సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం.. కీలక ప్రకటన విడుదల చేసిన భారత్

Highlights

Syria Crisis: సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటున్నారు.

Syria Crisis: సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటున్నారు. రష్యా, ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం కుప్పకూలే దశకు చేరుకుంటోంది. ఒక్కో నగరాన్ని కోల్పోతోంది.

దాదాపు దశాబ్ధం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లి.. గత కొన్నేళ్లుగా స్తబ్ధంగా ఉన్న సిరియాలో తిరుగుబాటు దారులు మళ్లీ రెచ్చిపోయారు. బషర్ అల్-అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాల్ని వెనక్కి నెడుతూ ఇప్పటికే పలు కీలక పట్టణాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇక తిరుగుబాటుదారుల తదుపరి లక్ష్యం రాజధాని డమాస్కస్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నగరాన్ని కూడా ఆక్రమిస్తే సిరియా పూర్తిగా రెబల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది.

టర్కీ మద్దతుతో మిలీషియా గ్రూపులు, ఇస్లామిస్ట్ తిరుగుబాటుదారులు చెలరేగుతున్నారు. సిరియాలోని రెండో అతి పెద్ద నగరం అలెప్పా సైతం వారి వశమైంది. సనా, హమా సిటీని తాజాగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పలు రీజియన్లు ప్రభుత్వం నుంచి చేజారాయి. అవన్నీ కూడా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్లాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సిరియాలో నానాటికి దిగజారుతున్న శాంతిభద్రతలు, యుద్ధ వాతావరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సిరియా అంతర్యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం అర్ధరాత్రి భారత్ కీలక ప్రకటన విడుదల చేసింది. తదుపరి ప్రకటన విడుదలయ్యేంత వరకు సిరియాకు వెళ్లొద్దని, ప్రయాణాలను మానుకోవాలని సూచించింది.

ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదింపులు నిర్వహించడానికి హెల్ప్ లైన్ నంబర్, ఈమెయిల్ ఐడీని అందుబాటులోకి తీసుకొచ్చారు. సిరియాలో ఉన్న భారతీయులందరూ కూడా డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయం కోసం ఎమర్జెన్సీ హెల్ప లైన్ నంబర్ 963993385973. అలాగే అత్యవసర ఈమెయిల్ [email protected].ద్వారా రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని జైస్వాల్ సూచించారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories