China New Land Border Law: మరో ఎత్తుగడ వేసిన డ్రాగన్ కంట్రీ

India Concerns about Dragon Country China New Land Boundary Law | India vs China Conflict
x

China New Land Border Law: మరో ఎత్తుగడ వేసిన డ్రాగన్ కంట్రీ

Highlights

China New Land Border Law: సరిహద్దుల్లో ప్రజలు నివసించేలా చట్టం రూపకల్పన...

China New Land Border Law: భారత సరిహద్దుల్లో వివాదాలకు తెరతీస్తున్న డ్రాగన్ కంట్రీ మరో ఎత్తుగడ వేసింది. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సరిహద్దుల్లో చైనా ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించేలా ఈ చట్టాన్ని రూపకల్పన చేసింది చైనా.

మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ.. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు తెలిపింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది.

చైనా జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశంలోనే నూతన చట్టానికి ఆమోదం తెలిపినట్లు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది. ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. అయితే పొరుగు దేశాలతో ఇప్పటికే వివాదాలు ఉన్న నేపథ్యంలో.. వాటిని చర్చలతోనే పరిష్కరించుకుంటామని వెల్లడించింది చైనా.

ఇక చైనా అమల్లోకి తెచ్చిన కొత్త చట్టంపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత సరిహద్దులపై ఈ చట్టం ప్రభావం చూపనుందని.. మరిన్ని ఆక్రమణలు జరిగే అవకాశాలు ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories