India-China Border Issue: చైనాతో ప్రతివారం భారత్ చర్చలు..

India-China Border Issue: చైనాతో ప్రతివారం భారత్ చర్చలు..
x
Narendra Modi, Jingping (File Photo)
Highlights

India-China Border Issue: భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో సమసిపోయే అవకాశాలు కనపడడంలేదు.

India-China Border Issue: భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో సమసిపోయే అవకాశాలు కనపడడంలేదు. జూన్ 15న గాల్వన్‌ లోయలో భారత్ - చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. డ్రాగన్‌ వర్గాలు మాత్రం ఎంత మంది సైనికులు హతమయ్యారో అసలు నోరు విప్పలేదు. ఈ విషయంలో మౌనమే పాటిస్తున్నారని పేర్కొన్నాయి. అయితే కనీసం 43 చైనా సైనికులు మరణించగా.. వారి మృతదేహాలను హెలికాప్టర్లలో తరలించారని తెలుస్తోందని భారత వర్గాలు తెలిపాయి. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత్, చైనా మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.

సరిహద్దుల్లో ఉద్రికత్తలు తగ్గించేందుకు ఇకపై రెండు దేశాలు ప్రతి వారం చర్చలు జరపనున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ని తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్‌ దుందుడుకు వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో సంప్రదింపులు, డబ్ల్యూఎంసీసీ కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. తూర్పు లద్దాఖ్‌లో చైనా దుందుడుకు వైఖరి అంశంపై చర్చించేందుకు ప్రతి వారం సహకార చర్చలు సమావేశాలకు అంగీకారం కుదిరింది. ఈ చర్చలకు

భారత్ తరపున ప్రతినిధులుగా విదేశాంగ, రక్షణ, హోం శాఖ, సైనిక బలగాల సభ్యులు ఉంటారు. గత వారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన డబ్ల్యూఎంసీసీ సమావేశంలో లద్దాఖ్‌లో సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామని పేర్కొన్నాయి. అయితే చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో వాయుసేన స్థావరంలో గత వారం చైనాకు చెందిన ఐఎల్‌-78 ట్యాంకర్‌ విమానాన్ని ఇండియా గుర్తించింది. ఈ విమానం యుద్ధవిమానాలకు గాల్లో ఇంధనం నింపుతుంది. తూర్పు లద్దాక్‌లో చైనా వాయుసేన కార్యకలాపాలు మరింత విస్తృతమయ్యాయి.

చైనా పక్కా ప్లాన్‌తో ఈ ఘర్షణలకు పాల్పడిందని నిరూపించే ఆధారాలు లభ్యం అవుతున్నాయి. గాల్వన్ ఘర్షణలకు కొద్ది ముందు భారత సరిహద్దుల్లో పర్వతారోహకులు, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న బలగాలను రంగంలోకి దింపిందని సమాచారం. ఈ నేపథ్యంలో వాటికి మద్దతుగా పీవోకేలోని స్కర్దూను కూడా ఉపయోగించుకొనే అవకాశం ఉంది. చర్చల్లో ఒకమాట, చేతల్లో ఒక తీరు కనబర్చుతోన్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ల నుంచి భారీగా ఆయుధ వ్యవస్థలు లడఖ్‌‌ చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థను చైనా సరిహద్దులకు తరలించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories