చైనా కుట్ర : ముందుగా ఇలా ప్లాన్ చేసింది..

చైనా కుట్ర : ముందుగా ఇలా ప్లాన్ చేసింది..
x
Highlights

సోమవారం రాత్రి లడఖ్‌లో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం చైనా పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర చేసింది.

సోమవారం రాత్రి లడఖ్‌లో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం చైనా పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర చేసింది. ముందుగా థర్మల్ ఇమేజింగ్ డ్రోన్‌లతో చైనా.. భారతీయ సైనికులను గుర్తించిందని, ఆపై వారి దళాలను పెంచుకుని భారత సైనికులపై దాడి చేసిందని వార్తా సంస్థ ఇండో- ఏషియన్ న్యూస్ సర్వీస్ (ఐఎఎన్ఎస్) వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. వాగ్వివాదం జరిగినప్పుడు, చైనా సైనికుల సంఖ్య భారత సైనికుల కంటే 5 రెట్లు ఎక్కువ అని పేర్కొంది.

కొంతమంది భారతీయ సైనికులు శత్రువులను ఎదుర్కోవటానికి చివరి శ్వాస వరకు పోరాడారు. అయితే చైనా సైనికులు.. భారత సైనికులపై అరణ్యం వలె విరుచుకుపడ్డారు. కొంతమంది జవాన్లపై తుపాకీ ఎక్కు పెట్టి, వారి చివరి శ్వాస వరకు హింసించారు. ఇందుకోసం చైనా సైనికులు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించారని.. మరోవైపు భారత సైనికులు ఆయుధాలను ఉపయోగించటానికి ఇష్టపడలేదని.. అయినప్పటికీ, వారు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తూ, ధైర్యంగా పోరాడుతూనే ఉన్నారని తెలిపింది.

ఇక చైనా దాడిలో అమరవీరుడైన కల్నల్ సంతోష్ బాబు, ఘర్షణకు ముందు తన సహచరులతో కలిసి చైనా వాగ్దానం చేసినట్లుగా.. తన దళాలను ఉపసంహరించుకుందా లేదా అని చూడటానికి వెళ్లారు. అయితే ఇంతలో, చైనా సైనికులు ఒక్కసారిగా చుట్టుముట్టి భారత సైనికులపై దాడి చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4 నుంచి 12 గంటల వరకు ఇద్దరి మధ్య 8 గంటలపాటు భీకర పోరు జరిగినట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories