పాకిస్థాన్‌లో అధికార పార్టీకి ఇమ్రాన్‌ఖాన్‌ షాక్‌

Imran Khans PTI Wins Punjab Bypolls
x

పాకిస్థాన్‌లో అధికార పార్టీకి ఇమ్రాన్‌ఖాన్‌ షాక్‌

Highlights

Pakistan: పాకిస్థాన్‌లోని అధికార పార్టీ మిత్రపక్షాలకు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ షాక్‌ ఇచ్చింది.

Pakistan: పాకిస్థాన్‌లోని అధికార పార్టీ మిత్రపక్షాలకు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ షాక్‌ ఇచ్చింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 15 స్థానాల్లో పాకిస్థాన్‌ తెహ్రిక్‌ ఇ-ఇన్‌సాఫ్-పీటీఐ విజయం సాధించింది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైన పీటీఐ ఈసారి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజా ఫలితాలపై స్పందించిన ఇమ్రాన్‌ఖాన్‌ పీటీఐ కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అధికారులు, పోలీసులు కలిసి పార్టీ కార్యకర్తలను, ప్రజలను వేధించినా భారీ మెజార్టీని కట్టబెట్టారని కొనియాడారు. అధికార పార్టీ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌-పీఎంఎల్‌ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా ప్రజలు సరైన తీర్పునిచ్చినట్టు ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయడంతోనే ఈ విజయం సాధ్యమైనట్టు ఇమ్రాన్‌ స్పష్టం చేశారు.

తాజాగా పాకిస్థాన్‌లో పెరుగుతున్న నిత్యావసరాలు, చమురు, గ్యాస్‌ ధరలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పైగా పీఎంఎల్‌ఎన్‌, విపక్షాలు ఏకమై అధికారంలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని కూల్చడంపైనా ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారని నిపుణులు చెబుతున్నారు. పీఎంఎల‌్ఎన్‌ పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌ స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో భాగమేనన్నారు. తమ ఓటమిపై పునర్‌ సమీక్షించుకుంటామని మరియం నవాజ్‌ తెలిపారు. తాజా ఎన్నికల్లో విజయంతో పంజాబ్‌ ప్రావిన్స్‌లో పీటీఐ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. పంజాబ్‌ ప్రావిన్స్‌లో మొత్తం 25 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే 25 మందిలో 20 మంది పీటీఐ ప్రజాప్రతినిధులను పాకిస్థాన్‌ ఎలక్షన్‌ కమిషన్‌ అనర్హత వేటు వేసింది. ఆ తరువాత ఆ 20 స్థానాలకు ఎన్నికలను నిర్వహించింది.

ఈ ఎన్నికల్లో పీఎంఎల్‌ఎన్‌ ఓటమి భారీ దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇమ్రాన్‌ఖాన్‌ మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజా ఫలితాలతో ఇమ్రాన్ మరింత రెచ్చిపోతారని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌పై ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. మరోవైపు పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. కరెంటు కోతలు పెరిగాయి. టీకా కూడా తక్కువగా తాగాలంటూ ప్రభుత్వం సూచిస్తోంది. వెరసీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇదిలానే కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి పీఎంఎల్‌ఎన్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories