పాక్ రాజ‌కీయ సంక్షోభం వెనుక అమెరికా హస్తం.. ఇమ్రాన్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు

Imran Khan Sensational Comments on America is There behind Political Crisis | Live News
x

పాక్ రాజ‌కీయ సంక్షోభం వెనుక అమెరికా హస్తం.. ఇమ్రాన్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు

Highlights

Imran Khan: అవిశ్వాస తీర్మానంపై ఇవాళ పాక్ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్...

Imran Khan: అమెరికాపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మ‌ళ్లీ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో రాజ‌కీయ సంక్షోభం వెనుక అమెరికా హస్తం ఉందని ఘాట్ వ్యాఖ్యలు చేశారు. తాను ఒక ప‌ప్పెట్‌లా ఉండాల‌ని అమెరికా భావించింద‌ని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. ర‌ష్యాలో తాను ప‌ర్య‌టించ‌డం అమెరికాకు న‌చ్చలేద‌న్నారు. అందుకే తనను ప్రధాని పదవీ నుంచి తప్పించేందుకు కుట్రలు చేశారని ఇమ్రాన్ ఆరోపించారు.

దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని పాకిస్థాన్ ప్రజలకు ఇమ్రాన్ పిలుపునిచ్చారు. బయటకు వచ్చి నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులను గొర్రెల మాదిరిగా కొనుగోలు చేసి విక్రయిస్తున్నారని ప్రతిపక్షాలు కఠోరమైన గుర్రపు వ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ పతనాన్ని "సంబరాలు" చేసుకుంటోందని ఆరోపిస్తూ, దేశంలోని మీడియాపై కూడా ఆయన మండిపడ్డారు. అలాగే భార‌త్‌పై ఇమ్రాన్‌ఖాన్‌ మ‌రోమారు ప్రశంస‌ల జోరు పెంచారు.

ప్రపంచంలో ఏ శ‌క్తి కూడా భార‌త్‌ను శాసించ‌లేద‌ని స్పష్టం చేశారు. భార‌త్ విదేశాంగ విధానం బాగున్నదంటూ మెచ్చుకున్నారు.ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై విప‌క్షాలు ప్రవేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ పాక్ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జ‌రుగ‌నున్నది. 342 సీట్ల అసెంబ్లీలో తమకు 172 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్షం చెబుతోంది, దీనికి కోరమ్‌కు పావువంతు సభ్యులు హాజరు కావాలి. మిస్టర్ ఖాన్ ఓడిపోతే, అవిశ్వాసం ద్వారా తొలగించబడిన మొదటి ప్రధానమంత్రి అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories