ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్.. నేనే గెలిచా అంటూ మరో ట్వీట్ !

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్.. నేనే గెలిచా అంటూ మరో ట్వీట్ !
x
Highlights

ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలు అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించని ట్రంప్ తాజాగా తానే గెలిచానంటూ ఓ ట్వీట్‌ చేశారు.

ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలు అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించని ట్రంప్ తాజాగా తానే గెలిచానంటూ ఓ ట్వీట్‌ చేశారు. 'ఐ వన్ ది ఎలక్షన్' అంటూ ట్రంప్ సోమవారం ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ పైన నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ ట్వీట్‌ను ట్విటర్‌ ఫ్లాగ్ చేసింది. ఈ పోస్ట్ క్రింద ఒక హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ఇక ట్రంప్ మరికొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. అధ్యక్ష పీఠంకోసం మోసాలకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ.. ఓటమిని అంగీకరించాలని సూచించారు. ఇకనైనా అహాన్ని వీడి దేశం కోసం పనిచేయాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories